బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 12 మార్చి 2015 (17:02 IST)

నా ఫ్రెండ్‌కి వెన్నెముకలో టీబీ ఉంది... తన ప్రేయసిని నన్ను...

నా స్నేహితుడు చాలా బాధపడుతున్నాడు. వాడి వెన్నెముకలో టీబీ ఉన్నట్లు వైద్యుడి ద్వారా తెలుసుకున్నాడు. అందుకని తన ప్రేయసికి అన్యాయం చేయలేననీ, ఆమెను ఆదుకోవాలని నన్ను అడుగుతున్నాడు. తామిద్దరం ప్రేమలో ఏనాడూ హద్దులు దాటలేదనీ, కాబట్టి ఆమెను ఎలాగైనా నావైపు తిప్పుకుని ప్రేమించి పెళ్లి చేసుకోమని బ్రతిమలాడుతున్నాడు. అసలు ఇది కరెక్టేనా...? 

 
ఇది సినిమా కాదు... జీవితం. మీ స్నేహితుడుకు వచ్చిన జబ్బు సరైన వైద్యం తీసుకుంటే తగ్గిపోతుంది. దాని గురించి అతడు అంతగా ఆందోళన చెందక్కర్లేదు. వ్యాధి రెండు మూడేళ్లలో తగ్గిపోతుంది. కాబట్టి ఆమెను వదులుకోవాల్సిన అవసరం లేనేలేదు. వ్యాధి నయం అయిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు.