గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 30 మార్చి 2015 (20:58 IST)

కిస్సింగ్ వీడియో పంపింది... సెక్స్ చేసుకుందామా అంటే చీవాట్లు పెట్టి మళ్లీ...

మా దూరపు బంధువుల అమ్మాయికి దురదృష్టవశాత్తూ భర్త చనిపోయారు. నేను బీటెక్ చదువుకునేందుకు వాళ్ల ఊరుకు వెళ్లాను. ఆమెతో ఓదార్పు మాటలు మాట్లాడితే, తన పట్ల అలాంటి జాలి మాటలు అవసరంలేదని చెప్పేసింది. మళ్లీ మరో మాట మాట్లాడకుండా నీకు టైమవుతుందని సాగనంపేసింది. ఇక అప్పట్నుంచి ఆమె ఇంటికి వెళ్లింది లేదు. కానీ ఈమధ్య ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాను. ఆ సమయంలో ఎన్నో విషయాలను నాతో పంచుకుంది. ఓ సందర్భంలో అమ్మాయి-అబ్బాయి తాలూకు ముద్దు క్లిప్పింగును పంపింది. ఆ ముద్దు క్లిప్పింగు చూసి నేను ఎగ్జయిట్ అయ్యాను. ఆమెతో రొమాంటిక్ గా చాట్ చేశాను. 

 
ఆ మాటలకు ఆమె అసహనం ప్రకటించింది. దాంతో ఆపేశాను. మరికొన్ని రోజులకు అకస్మాత్తుగా సెక్స్ సంబంధిత టాపిక్ తెచ్చింది. అలా మా చాటింగ్ చాలా దూరం వెళ్లింది. ఆమెతో అలా చాటింగ్ చేస్తూ ఇద్దరం సెక్సు చేసుకుందాం అని రాసేశాను. వెంటనే చాటింగ్ కట్ చేసి... ఫోను చేసి ఇష్టమొచ్చినట్లు చీవాట్లు పెట్టింది. సెక్స్ సంభాషణ చేసినందుకు కోపగించుకుంది. ఇది జరిగిన ఆరేడు నెలలయింది. ఇప్పుడు మళ్లీ సెక్స్ చాటింగ్ చేస్తోంది. ఆ రోజు కోపంలో ఏదో అన్నానని సంజాయిషీ ఇచ్చింది. దానర్థం సెక్సుకు ఆమె అంగీకరించిందని అనుకుంటున్నాను. 
 
ఇప్పటికే సెక్స్ విషయంలో ఆమె తన భావన వ్యక్తీకరించింది. ఐనా మళ్లీ భంగపడేందుకు సిద్ధమవుతున్నట్లున్నారు. వివాహేతర సంబంధాలు ఇద్దరికీ మంచిది కాదు. ఆమెపై ఇష్టముంటే పెద్దలతో మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇవ్వండి. అంతేగాని, ఆమె జీవితంతో ఆటలాడుకోవద్దు.