శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 20 జూన్ 2015 (14:47 IST)

పురుషాంగం పైన శనగ గింజంత రెండు పుట్టుమచ్చలున్నాయి... సెక్స్ లైఫ్‌కు అడ్డంకి అవుతాయా...?

నా వయసు 25 ఏళ్లు. ఇప్పుడే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఐతే నన్నో సమస్య వేధిస్తోంది. నా పురుషాంగం పైన శనగ గింజల సైజులో రెండు పెద్దపెద్ద పుట్టుమచ్చలున్నాయి. పెళ్లయిన తర్వాత నా భార్య వాటిని చూస్తే సెక్సుకు అంగీకరించదేమోనని భయంగా ఉంది. వాటిని పోగొట్టేదెలా...?
 
పుట్టుమచ్చలు సెక్స్ జీవితానికి అడ్డంకి ఏమీ కావు. పురుషాంగం స్తంభించకుండా, ఇంకా ఇతరత్రా స్తంభన సమస్యలుంటే సెక్స్ జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. అంతేతప్ప పుట్టుమచ్చలున్నంత మాత్రాన ఇబ్బందేమీ ఉండదు. మరీ అంతగా ఆ పుట్టుమచ్చలను తొలగించుకోవాలనుకుంటే వైద్యుడిని సంప్రదించండి. తగిన పరిష్కారం లభిస్తుంది.