గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 29 జూన్ 2015 (18:33 IST)

ఆయన నిద్రపోడు నన్ను పోనివ్వడు... సెక్స్ చేయడు... సమస్య ఏమై ఉంటుంది?

ఆయన ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లయి మూడేళ్లయింది. కానీ సెక్సులో పాల్గొన్నది వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. సెక్స్ కావాలని నేను అభ్యర్థిస్తే ఉపక్రమిస్తుంటారు. ఈమధ్య నేను అడుగక ముందే ఆయనే మొదలుపెడుతున్నారు. కానీ ఎంతసేపు ప్రయత్నించినా సెక్సులో విఫలమవుతున్నారు. 
 
అర్థరాత్రి దాటినా అలాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిద్రపోదామంటే వినరు. నన్ను పడుకోనివ్వరు. ఆయన నిద్రపోరు. ఆయన నిద్రించే గంటలు నాలుగైదు గంటలకు మించి ఉండదు. సమస్య ఏమిటో వైద్యులకు చూపించుకోమంటే వినడంలేదు. పేరెంట్స్‌కు చెబితే పరువు పోతుందని ఏమీ చేయలేకపోతున్నాను. ఈ సమస్యను అధిగమించడం ఎలా...?
 
సాప్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేసే వారు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య నిద్ర తక్కువగా ఉండటం. నాలుగైదు గంటలు నిద్రపోయి మిగిలిన కాలమంతా పనిపై ధ్యాసతో ఉండటం మూలంగా ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా మగవారిలో సెక్స్ సామర్థ్యం తగ్గుతుంటుందనేది పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఒత్తిడి కారణంగా వారిలో కొర్టిసల్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనితో సెక్సుకు అవసరమైన టెస్టోస్టెరాన్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. అందువల్ల సరిపడినంత నిద్ర... అంటే కనీసం 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. అలా చేస్తే... క్రమంగా సెక్స్ పరంగా పూర్తి సామర్థ్యంతో ఉంటారు. అప్పటికే సెక్సులో విఫలమవుతుంటే వైద్యుడిని సంప్రదించాల్సిందే.