శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 16 జులై 2015 (19:04 IST)

ఔను... నేను నీ ప్రేమికురాలినే అంటేనే సెక్స్ చేస్తున్నాడు... ఇతడి మైండ్‌సెట్ సరిగానే ఉందా..?

ఆయనకు కాలేజీ డేస్ లో ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేదట. ఆమెను ఎంతగానో ప్రేమించాడట. కాకపోతే ఈయనది వన్ సైడ్ లవ్. తన లవ్ గురించి ఆమెకు చెబితే మరోసారి లవ్ అంటూ తన వద్దకు వస్తే ఏం జరుగుతుందో చూసేందుకు నువ్వండవు అని హెచ్చరించిందట. అప్పట్నుంచి ఆమెను మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోయారట. ఆమెనే తలచుకుంటూ హస్త ప్రయోగం కూడా చేసుకునేవారట. పెళ్లయ్యాక నెల రోజుల తర్వాత ఈ చరిత్ర మొత్తం చెప్పేశారు. ఆయన చెప్పినదంతా భరించాను. కానీ ఇప్పుడు కొత్త కోర్కెతో వేధిస్తున్నారు. సెక్స్ చేసే ముందు నేను నీ ప్రేయసిని.. అంటూ తన మాజీ ప్రియురాలి పేరు చెప్పమని అంటున్నాడు. అలా చెబితేనే సెక్స్ చేస్తానంటున్నాడు. ఒకవేళ నేను చెప్పకపోతే ఆరోజు సెక్స్ చేయడంలేదు. ఆయన మనస్తత్వం సరిగానే ఉందా లేదా...?
 
కొంతమంది యువకులు ఇలా మరీ ఎక్కువగా ఊహించుకుంటుంటారు. వారికి నచ్చిన అమ్మాయిని చేసుకోవాలని తప్పించి, ఆ అమ్మాయికి తను నచ్చానా లేదా అన్నది పట్టించుకోరు. ఒకవేళ ఇలా దూరమైపోయినా ఆ జ్ఞాపకాల్లో బతుకుతుంటారు. కానీ పెళ్లయ్యాక గత స్మృతులు లోపలే ఉంచేసి వర్తమానంలో జీవించేస్తుంటారు చాలామంది. కానీ  ఇలా ఎక్కడో కొందరు మాత్రమే తను ప్రేమించిన అమ్మాయిని పదేపదే గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఇది పడకగది వద్దకు కూడా వస్తేనే సమస్య. అతడితో మీ అసంతృప్తిని చెప్పండి. వినకపోతే మాత్రం ఖచ్చితంగా సైక్రియాట్రిస్టుకు చూపించాల్సిందే.