గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 17 జులై 2015 (15:17 IST)

బ్రా తొలగించేందుకు ససేమిరా అంటున్నారు... ఇపుడు కూడా అలాగే...

ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. ప్రేమించుకునే రోజుల్లో చాలా చిలిపి పనులు చేసేవారు. నేనంటే ప్రాణం. నేను క్షణం కోపంగా ఉన్నా తట్టుకోలేరు. ఐతే ఆయనలో ఓ వింత చేష్టను గమనిస్తున్నాను. ప్రేమించుకునే కాలంలో ఆయన నా బ్రాపై ముద్దులు పెట్టుకునేవారు. ఇపుడు పెళ్లయిన తర్వాత కూడా పడక గదిలో అలాగే చేస్తున్నారు. బ్రా తొలగించేందుకు ససేమిరా అంటున్నారు. బ్రాపై ముద్దులు పెట్టేసి మిగిలినది చేసేస్తున్నారు. నాకేమిటో ఓ రకమైన ఫీలింగ్ కలుగుతోంది. ఆయన చేస్తున్నది నాకు నచ్చడంలేదు. ఆయన ప్రవర్తనకు కారణం ఏమై ఉంటుంది...?
 
ప్రేమికుల్లో కొందరు తమ ప్రేమ తాలూకు పాత జ్ఞాపకాలను అలా నిక్షిప్తం చేసుకుంటుంటారు. మీవారు చేస్తున్నది అలాంటిదే అనుకోవచ్చు. ఆయన ప్రేమికుడిగా ఉన్న సమయంలో ఎలాంటి చేష్ట చేశారో అదే ఇప్పుడు పెళ్లయ్యాక కూడా ఊహించుకుని ప్రవర్తిస్తున్నారు. ఇందులో ఆందోళన చెందడానికి ఏమీలేదు. బ్రా తప్పక తొలగించాలనుకునే పక్షంలో ఆవిధంగా ఆయన దృష్టిని ఆకర్షించాలి. ఇందుకు తగిన రొమాంటిక్ పద్ధతులను అవలంభిస్తే సరిపోతుంది. తప్పకుండా ఆయన తన పద్ధతిని మార్చుకుంటారు.