బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 23 జులై 2015 (11:36 IST)

ఫారిన్‌లో ఆ అమ్మాయితో కలిసి ఉండమంటున్నారు... అక్కడ ఇద్దర్నీ చూసుకుని...

మా నాన్న స్నేహితుడు మహారాష్ట్రలో ఉద్యోగం చేస్తుంటారు. వాళ్లమ్మాయిని ఫారిన్ యూనివర్శిటీలో చదువుకునేందుకు పంపిస్తున్నారట. నన్ను కూడా ఆ అమ్మాయితో కలిసి వెళ్లి ఫారిన్ యూనివర్శిటీలో చదువుకోమని అంటున్నారు మా నాన్న. అంతేకాదు.. ఇద్దరికీ ఒకే ఇల్లు కూడా అరేంజ్ చేసినట్లు చెపుతున్నారు. ఇద్దరి చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకోండని అంటున్నారు. ఆ అమ్మాయితో ఇంతవరకూ నేను మాట్లాడలేదు. 
 
అంతేకాదు... ఆమె నాకంటే ఓ ఏడాది పెద్దది. ఈ విషయాన్నే మా నాన్నతో అంటే, దీని గురించి పెద్దగా పట్టించుకోవద్దనీ చదువుతూ ఇద్దరూ అర్థంచేసుకుని పెళ్లి నిర్ణయానికి రావాలంటూ చెప్పేసి నా ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఐతే ముక్కుమొహం తెలియని అమ్మాయితో కలిసి ఎలా ఉండాలో అర్థం కావడంలేదు. పైగా ఏడాది పెద్దదయిన అమ్మాయిని పెళ్లాడమంటున్నారు. మా నాన్న మాటకు కాదని ఎదురు చెప్పలేను. కానీ నాకేదో గిల్టీగా ఉంది. ఇది కరెక్టుగా అనిపించడంలేదు....
 
మీరు అనుకుంటున్నట్లు పెళ్లికి ముందే ఆ అమ్మాయితో విదేశంలో కలిసి ఉండాలని మీ తండ్రిగారు చెప్పడం ఆశ్చర్యంగానే ఉంది. ఐతే ఆయన స్నేహితుని ప్రపోజ్ మేరకు ఇలా చెప్పి ఉండిఉండవచ్చు. ఇకపోతే ఆమె ముక్కుమొహం తెలియదంటున్నారు. మీ నాన్న నిర్ణయం విన్నారు కనుక ఆమెతో ఫోన్లో మాట్లాడండి. ఫారిన్ వెళ్లే ముందు కనీసం ఒక్కసారయినా కలుసుకుని మాట్లాడేందుకు ప్రయత్నించండి. దాంతో మీలో ఉన్న భావన తొలగుతుంది. 
 
ఆమె భావాలు మీ భావాలతో కలిసినట్లు అనిపిస్తే మీరు నిరభ్యంతరంగా పెళ్లాడవచ్చు. ఒక ఏడాది ఎక్కువ వయసున్నా పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఐతే మీ ఇద్దరిని విదేశీ చదువుల కోసం ఒకే ఇంట్లో పెట్టి.. వయసులో ఉన్న స్త్రీపురుషులు లైంగికంగా కలవరని వారు అనుకోవడం కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఏదేమైనప్పటికీ ఆ అమ్మాయి మీ భావాలకు తగినవిధంగా అనిపిస్తే విదేశీయానంకు ముందే నిశ్చితార్థం చేసుకోవడం మంచిది. తద్వారా నలుగురు నాలుగువిధాలుగా అనుకునే అవకాశం ఉండదు. చదువు ముగించుకుని సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు.