గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 23 జులై 2015 (12:54 IST)

బయటే స్ఖలిస్తున్నాగా... గర్భం రాదులే అంటున్నాడు... వస్తుందని నా భయం...

బావతో నేను ప్రేమలో పడ్డాను. పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంటున్నాం. ఐతే మా ఇద్దరి చదువు ఇంకా పూర్తికాలేదు. మరో మూడేళ్లలో పూర్తవుతుంది. అప్పటివరకూ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాం. కానీ మా బావ నన్ను తాకుతూ కౌగలించుకుంటున్న సమయంలో సెక్సు కావాలని గొడవ చేసేవాడు. చాలా దీనంగా బతిమాలేవాడు. 
 
తప్పనిసరి పరిస్థితుల్లో సెక్సుకు ఒప్పుకున్నాను. అది కూడా ఒక్కసారి మాత్రమే అని చెప్పాను. కానీ అలా మొదలుపెట్టిన మా బావ ఇపుడు రోజుమార్చి రోజు చేస్తున్నాడు. ఐతే వీర్యం స్ఖలనం జరుగుతుందనగా పురుషాంగాన్ని బయటకు తీసేస్తున్నాడు. వీర్యం స్ఖలించడం లేదు కనుక గర్భం రాదులే అంటున్నాడు. ఒకవేళ అప్పటికీ పొరపాటున యోని లోపలికి వీర్యం ప్రవేశిస్తుందా...? అలా రాకుండా జాగ్రత్తలు ఏమయినా ఉంటే చెప్పండి.
 
సురక్షితం కాని లైంగిక క్రియలో వీర్యం స్ఖలనం అనేది చివరి నిమిషంలో బయటకు తీసి చేసినా, అంతకుముందే వీర్యం యోనిలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. కనుక ముందుగా మీరు పెళ్లి కాకముందు సెక్సులో పాల్గొనడం సత్వరమే ఆపివేయడం శ్రేయస్కరం. ఒకవేళ సెక్సులో పాల్గొనాల్సి వస్తే గర్భం రాకుండా పిల్ 72 అనే టాబ్లెట్లు వాడాలి. 
 
ఈ మాత్రలు సెక్సులో పాల్గొన్న 12 గంటల లోపుగా వాడాలి. మొదట ఒక టాబ్లెట్ వేసుకుని ఆ తర్వాత 12 గంటలు గడిచాక మరో మాత్ర వేసుకోవాలి. ఇలా 12 గంటల తేడాతో 2 బిళ్లలు వేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదు. ఐతే చదువు ముగించేంతవరకూ ఇద్దరూ సెక్సుకు దూరంగా ఉండండి. పెళ్లి చేసుకున్న తర్వాత దాంపత్య సుఖం అనుభవించవచ్చు.