శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : సోమవారం, 27 జులై 2015 (16:33 IST)

స్ట్రోక్స్ ఇచ్చినా తృప్తి లేదు... అతడిది చిన్నదేమో....? పెళ్లయినా ఇంతేనా...?

మా పెళ్లికి మరో ఏడాది వ్యవధి ఉంది. నా బాయ్ ఫ్రెండు బతిమాలితే సెక్సులో పాల్గొన్నాను. సెక్స్ చేసే సమయంలో అతడు తన పురుషాంగాన్ని నా యోనిలో ప్రవేశింపజేసి స్ట్రోక్స్ ఇస్తుంటాడు. నాకున్న సమస్య ఏంటంటే, అతడు ఎంత గట్టిగా స్ట్రోక్స్ ఇస్తున్నా... యోనికి సరిపడా పురుషాంగం ఉన్నట్లు అనిపించడం లేదు. 
 
సెక్స్ చేసే సమయంలో అతడి స్తంభించిన పురుషాంగాన్ని ప్రవేశపెట్టినా ఇంకా గ్యాప్ ఉంటోంది. అందువల్లనే ఏమోగానీ, అతడు ఎంతగా గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చినా తృప్తి కలుగడంలేదు. పెళ్లయిన తర్వాత కూడా ఇలాగే ఉంటే, సెక్స్ జీవితంలో ఆనందం పొందలేకుండా పోతానని బెంగగా ఉంది. అతడి పురుషాంగం పెద్దదిగా మారి నన్ను తృప్తిపరిచే మార్గం ఉందా...?
 
దీనికి చాలా కారణాలుంటాయి. పురుషాంగం ప్రవేశించే కంటే ముందే యోని లైంగికపరంగా బాగా స్పందినప్పుడు సాగుతున్నట్లు ఉంటుంది. అలాంటి సమయంలో పురుషుడు స్పందించిన అంగాన్ని ప్రవేశపెట్టినప్పటికీ తగినంత ఫోర్ ప్లే చేయకుండా ప్రవేశపెడితే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. లైంగిక ప్రక్రియలో ఫోర్ ప్లే అత్యావశ్యం. అలా చేయకుండా నేరుగా పురుషాంగాన్ని ప్రవేశపెట్టినట్లయితే ఫలితం ఇలాగే ఉంటుంది. 
 
మరో విషయం ఏమిటంటే, పెళ్లి కాకుండా ముందుగానే సెక్సులో పాల్గొనేవారిలో ఆందోళన, భయం ఉంటాయి. గర్భం వస్తుందనే జంకు ఉంటుంది. అందువల్ల సెక్సులో సమర్థవంతంగా పాల్గొనలేకపోతారు. ఇకపోతే పురుషాంగం ఎంత పొడవు ఉన్నదన్నది ముఖ్యం కాదు... అది స్తంభించి గట్టిగా ఉంటుందా లేదా అనేది ముఖ్యం. 
 
అంతేకాదు... స్త్రీ యోనిలో లైంగిక ఆనందాన్ని పెంచి సంతృప్తికి గురిచేసే కామనాడులు 2 నుంచి 3 అంగుళాల లోపే ఉంటాయి. కనుక పురుషాంగం పొట్టిగా ఉన్నా స్తంభించి ఉంటే సెక్సులో స్త్రీకి అమితానందం కలుగుతుంది.