బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 27 జులై 2015 (18:06 IST)

నా స్నేహితుడి భార్య నాతో పిల్లలు కంటానంటోంది... నేను కూడా...

మేమిద్దరం చిన్ననాటి స్నేహితుల. నాకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నా స్నేహితుడికి కూడా 4 ఏళ్ల కిందటే పెళ్లయింది. ఐతే వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో అతడు తన భార్యను డాక్టర్ వద్ద చెక్ చేయించాడు. ఆమెకు ఎలాంటి లోపం లేదని తేలింది. దాంతో నా స్నేహితుడిలోనే లోపం ఉందని అర్థమయింది. వాడిని టెస్ట్ చేయించుకోమంటే వినడంలేదు. 
 
ఈమధ్య నా స్నేహితుడు - అతడి భార్య ఇద్దరూ పిల్లల పుట్టకపోవడం విషయంపై నా సమక్షంలోనే కీచులాడుకున్నారు. నేనే సర్ది చెప్పాను. ఆ తర్వాత వాడు ఆఫీసుకి వెళ్లిపోయాడు. వాడు వెళ్లిపోయిన తర్వాత నా స్నేహితుని భార్య భోరున విలపించింది. తనను గొడ్రాలని అందరూ అంటున్నారని వెక్కివెక్కి ఏడ్చింది. 
 
నేను ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాను. అంతే, ఆమె నన్ను గట్టిగా కౌగలించుకుంది. తనతో రతిలో పాల్గొని పిల్లలు కలిగేలా సహాయం చేయాలని అర్థించింది. ఆమె పరిస్థితి చూసి ఆ క్షణంలో ఆమెతో సెక్సులో పాల్గొన్నాను. ఇద్దరం సెక్సులో బాగా ఎంజాయ్ చేశాము. ఇక అప్పట్నుంచి రోజూ నా స్నేహితుడు ఆఫీసుకు వెళ్లగానే సెక్స్ చేయించుకుంటుంది. ఇప్పుడు నాకు కొత్త భయం పట్టుకుంది. 
 
నా కారణంగా ఆమె గర్భవతి అయితే అది నా స్నేహితుడికి తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉంది. అంతేకాదు, ఈ విషయం నా భార్యకు తెలిస్తే... అనే ఊహ చాలా భయాన్ని కల్గిస్తోంది. ఆమె మాత్రం నన్ను వదలటం లేదు. రోజూ సెక్స్ కావాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది. ఏం చేయాలో పాలుపోవడంలేదు...
 
స్నేహితుడుకి సాయం చేయాల్సింది ద్రోహం చేస్తున్నారు. అతడి భార్య పిల్లలు లేరన్న ఆవేదన, దుఃఖంలో సెక్స్ కావాలని అడిగి ఉండవచ్చు. అంతమాత్రం చేత ఆమెతో రతిలో పాల్గొనడం భావ్యం కాదు. స్నేహితుడిని వైద్యుని వద్దకు తీసుకెళ్లి అతడి వీర్యంలో ఉండాల్సిన సంఖ్యలో వీర్యకణాలు ఉన్నాయా లేదా అని చెక్ చేయించి వారిద్దరికీ పిల్లలు పుట్టేట్లు చేయాల్సిన బాధ్యత మీది. అలాంటిది స్నేహితుని భార్యతో సెక్సులో ఒక్కసారి కాదు రోజూ పాల్గొంటున్నారు. 
 
ఒకవేళ ఆమె గర్భం ధరిస్తే ఆ బిడ్డకు తండ్రి మీరే అవుతారు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాదు. డీఎన్ఎ పరీక్ష ద్వారా నిరూపిస్తారు. అంతేకాదు, ఒకవేళ అదే జరిగితే మీ భార్యాపిల్లల పరిస్థితి ఏమిటి..? మీ భార్య మిమ్మల్ని ఉపేక్షిస్తుందా...? మీ స్నేహితుడి భార్య పట్ల మీరు చూపిస్తున్న చర్య ఇద్దరి కుటుంబాలను సమస్యల సుడిగుండంలోకి నెడుతుంది. కనుక తక్షణమే ఆమెతో సెక్స్ సంబంధాన్ని ఆపేసి స్నేహితుడి ఆరోగ్యాన్ని చెక్ చేయించి సహాయపడండి.