గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 29 జులై 2015 (20:06 IST)

నా వయసు 27.. నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది... ఆడవాళ్లను చూస్తే....

నా వయసు 27 సంవత్సరాలు. నాకు ఓ చెడ్డ అలవాటు ఉంది. నా చుట్టూ ఎవరైనా స్త్రీలు, అమ్మాయిలు కనపడితే వారి పట్ల సెక్స్ కోర్కెలు కలుగుతాయి. ఆ సమయంలో అంగం స్తంభిస్తుంది. హస్త ప్రయోగం చేస్కుంటూ వారికి చూపించాలనిపిస్తుంది. నాకిది తప్పు అని తెలిసినా మానుకోలేకపోతున్నాను. ఫ్రెండ్స్‌తో బయటకెళ్తే సరిపోతుందనుకుంటాను కాని ఒక్క రోజయినా ఇలాంటివి చేయాలనిపిస్తుంటుంది. నా ఈ పరిస్థితి నుండి బయట పడేదెలా...?
 
చెడ్డ అలవాటు అని మీరే చెపుతున్నారు. కాబట్టి అందులో ఎలాంటి సందేహం లేదు. యుక్త వయసులో సెక్స్ కోర్కెలు కలుగడం సహజమే కానీ... ఇలా అసహజమైన రీతిలో బహిరంగ ప్రదేశాల్లో అంగ ప్రదర్శన అనేది అసహజమైన పరిస్థితి. ఈ స్థితి నుంచి బయటకు రాలేకపోతుంటే మానసిక వైద్యుడిని సంప్రదించాల్సిందే. వారు తగు వైద్య చికిత్స అందిస్తారు.