గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 30 జులై 2015 (19:16 IST)

అతడు నన్ను అలా ఉపయోగించుకుని వదిలేశాడు... కానీ నేను ప్రేమిస్తూనే ఉన్నా...

బహుశా ఇలాంటి పరిస్థితి ఎవ్వరూ ఎదుర్కొని ఉండరేమో. కానీ నాకు ఎదురైంది. నా 19 ఏళ్ల వయసులో 25 ఏళ్ల అబ్బాయితో పరిచయమైంది. అది కూడా నా పాఠాల్లో డౌట్స్ చెప్పే క్రమంలో స్నేహం కుదిరింది. అది క్రమంగా బలపడి లైంగిక సంబంధానికి దారి తీసింది. నేను హయ్యర్ స్టడీస్ కు వెళ్లేవరకూ మేమిద్దరం పలుమార్లు సెక్సులో పాల్గొన్నాం. నేను ఫారిన్లో చదువుకునేందుకు వెళ్లాను. మూడేళ్లు గడిచిపోయింది. ఆ సమయంలో అతడిని కాంటాక్ట్ చేద్దామంటే అతడి ఫోన్ స్విచాఫ్ అయిపోయి ఉంది. 
 
మూడేళ్ల తర్వాత తిరిగొచ్చి చూస్తే అతడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నన్ను చూసి మామూలుగానే పలుకరించాడు. ఇంటికి రమ్మని చెపితే వెళ్లాను. మళ్లీ సెక్స్ చేసుకుందామని అడిగాడు. నాకు కోపం వచ్చింది. నాతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని మళ్లీ ఇద్దరం లైంగికంగా కలుద్దామని అడగడంపై కోపం వచ్చి బాగా తిట్టి వచ్చేశాను. ఈలోపు నాకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వెళ్లిపోయాను. 
 
కానీ అతడితో గడిపిన క్షణాలను మర్చిపోలేకపోతున్నాను. అతడికి పెళ్లయిపోయినా ఇంకా అతడిని ప్రేమిస్తూనే ఉన్నాను. వీలు దొరికితే మళ్లీ వెళ్లాలని మనసు ఆరాటపడుతోంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేదు.
 
ఇలాంటి దారుణ స్థితిని కొందరు యువతులు ఎదుర్కొంటుంటారు. చదువుకునే సమయంలో పరస్పర ఆకర్షణ మూలంగా లైంగికంగా దగ్గరవడం జరుగుతుంది. ఆ తర్వాత పెద్దవారి వత్తిడి కారణంగానో, లేదంటే స్వార్థంతోనో లేదా మరో కారణం మూలంగానే విడిపోయి నరకాన్ని అనుభవిస్తుంటారు. లైంగికంగా ఒక్కటవ్వడంతో సదరు వ్యక్తిని మరువలేకు అవే జ్ఞాపకాలతో సతమతమవుతుంటారు. 
 
కానీ పరిస్థితి చేయి దాటిపోయాక చేయగలిగింది ఆ చేదు జ్ఞాపకాల నుంచి త్వరగా బయటపడటమే. వాటిని మర్చిపోయేందుకు ఇతర వ్యాపకాలు.. అంటే, వృత్తి కాకుండా రచనలు, క్రీడలు వంటి వాటిపై దృష్టి సారిస్తే పాత వాటిని ఆలోచించే తీరిక దొరకదు. అలాగే కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన అవసరం కూడా ఉంది. సరియైన వ్యక్తిని చూసి వివాహ బంధంతో ఒకటైతే పాత చేదు గుర్తులు వాటంతట అవే దూరమవుతాయి.