గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2015 (21:09 IST)

ఆమె ఎలాంటి భంగిమలంటే ఇష్టపడుతుందో...?!!

మాకు పెళ్లయింది కానీ ఇప్పటివరకూ సెక్స్ పరంగా కలుసుకోలేదు. త్వరలో ఇద్దరం కలుసుకోబోతున్నాం. ఐతే ఎలాంటి భంగిమలను స్త్రీ అమితంగా ఇష్టపడుతుందో నాకు తెలియదు. స్త్రీని సెక్సులో బాగా తృప్తి పరిచే భంగిమలు ఏవో తెలుసుకోవాలని ఉంది... 
 
దాంపత్య జీవితంలో మహిళలు రోజుకో విధంగా రతి భంగిమను ఇష్టపడుతారని చెపుతారు సెక్సాలజిస్టులు. ఎందుకంటే సెక్స్‌లో బోర్ కొట్టకుండా ఉండేందుకు వారు ఈ తరహా విధానాన్ని పాటించేందుకు ఇష్టపడుతారట. పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందగలరు. సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడతారని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. రోజుకో భంగిమలో జరిపినా ఈ మూడు రకాల సెక్స్ భంగిమలను ఉపయోగిస్తూ భాగస్వామిని పూర్తిగా సంతృప్తిపరచడం సాధ్యపడగలదని చెపుతున్నారు. 
 
రోజంతా ఆఫీసు పనులతో అలసిపోయే స్త్రీలు తన భాగస్వామి తనపై నుండి జరిపే సెక్స్ పద్ధతిని కోరుకుంటారు. సెక్స్ కోర్కెలు అధికంగా కలిగిన వారైతే తామే పురుషునిపైన కూర్చుని సెక్స్ జరుపేందుకు ఆసక్తి చూపుతారు. ఇది రెండో సెక్స్ భంగిమ. అలాగే తాను వంగి వెనుక వైపు నుంచి పురుషుడు సెక్స్ చేయడం మూడోది. ఈ మూడింటిలోనూ పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం ద్వారా ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ ఆనందం పొందగలరని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతారని సెక్సాలజిస్టులు వెల్లడిస్తున్నారు.