శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 3 ఆగస్టు 2015 (16:21 IST)

ఎంత ప్రయత్నించినా వెళ్లడంలేదు... బిగుతుగా ఉంది, వెడల్పు చేయడం ఎలా...?

నా భార్య యోని చాలా బిగుతుగా ఉంది. ఎన్నిమార్లు ట్రై చేసినా ఇదే పరిస్థితి. విసుగెత్తి చాలాసార్లు సెక్స్ చేయడం మానుకున్నాను. వివిధ భంగిమల్లో చేసేందుకు రకరకాలుగా ప్రయత్నించాను. ఫోర్ ప్లే చేసినా ఫలితం ఉండటం లేదు. నా పురుషాంగం సైజు 6 అంగుళాలు ఉంది. అందుకనే వెళ్లడంలేదా...? ఆమె యోని సైజును పెద్దది చేయడం ఎలా...?
 
యోని బిగుతుగా ఉండి అంగ ప్రవేశానికి కష్టంగా మారడం వెనుక పలు కారణాలు ఉంటాయి. ఆమెకు సెక్స్ ఇష్టం లేకపోవడమో లేదంటే సెక్స్ అంటే భయమో... అయి ఉండవచ్చు. ఇవేవీ కారణం కానట్లయితే చాలా అరుదుగా కొందరిలో కన్నెపొర మరీ దళసరిగా ఉండటంతో సెక్స్ సాధ్యం కాకుండా ఉంటుంది. కాబట్టి ముందుగా ఆమెలో సెక్స్ పట్ల ఏమైనా అపోహలున్నాయేమో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా సాధ్యం కానట్లయితే గైనకాలజిస్టును సంప్రదిస్తే తగు చికిత్స చేస్తారు.