శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 5 ఆగస్టు 2015 (15:43 IST)

అలా తగ్గిపోయిందేమిటి అంటోంది... జిమ్‌కు వెళ్లడం వల్లనేనా...?

మా పెళ్లయి ఏడాది దాటింది. ఐతే నేను అతిగా బరువు పెరగడంతో వ్యాయామం చేయమని నా శ్రీమతి గొడవ పెట్టుకుంది. దాంతో ప్రారంభించాను. ఈమధ్య సెక్స్ చేస్తుంటే... అంగం సైజు తగ్గిందేమిటి అని ప్రశ్నించింది. నిజంగానే నేను కొలుచుకుని చూసుకుంటే తగ్గిపోయి కనబడుతోంది. మామూలుగా అయితే దీని సైజు 3.5 అంగుళాలుగా ఉంది. స్తంభించినప్పుడు 5.2 అంగుళాలుగా ఉంది. ఐతే ఇంతకుముందు ఇది 5.5 దాకా ఉండేది. అలాగే మామూలు సమయాల్లో 4 అంగుళాలు ఉండేది. నేను వ్యాయామం చేయడం వల్ల ఇలా అయిపోయిందా..? దీనివల్ల నా భార్యలో అసంతృప్తి పెరుగుతుందేమోనని భయంగా ఉంది. ఎలా...?
 
మీది అపోహ. ఇదివరకటికి ఇప్పటికి మీ దేహంలో మార్పులు వచ్చి ఉంటాయి. దీనికి కారణం వ్యాయామం చేయడం వల్లనే. ఈ కారణంగా శరీరంలో చేరిన అదనపు కొవ్వు కరిగి ఆకృతిలో తేడా అగుపిస్తుంది. అది కేవలం ఛాతీ, కాళ్లూ, చేతులు, ముఖం వంటి అవయవాల్లోనే కనబడుతుంది. కానీ పురుషాంగం పైన ఎలాంటి ప్రభావమూ ఉండే అవకాశం లేదు. మరీ సైజు తగ్గడం అనేది దాదాపు ఉండదనే చెప్పాలి. వ్యాయామం చేయడం వల్ల పురుషాంగం పైన ఎలాంటి ప్రభావం ఉండది. కానీ పొగత్రాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లున్నట్లయితే పురుషాంగం పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెపుతారు వైద్యులు. మరీ అంత అనుమానంగా ఉంటే వైద్యుడిని సంప్రదించండి.