శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 6 ఆగస్టు 2015 (14:36 IST)

ఆమె అలా వచ్చేస్తుంది... ఆమెకు నన్నలా చూడాలని ఉందట...

మాకు పెళ్లయి ఏడాదిన్నర గడిచింది. కానీ మా ఇద్దరి మధ్య సెక్సుకు సంబంధించి సంభాషణ స్వేచ్ఛగా ఉండటం లేదు. ఏదో యాంత్రికంగా జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రివేళ పడక గదిలో నేను చేసే దానికి, నా భార్య చేసే పనులకు పొంతన ఉండటంలేదు. నాకు సెక్స్ కోర్కెలు విపరీతం. కానీ ఆమె నాకు కోర్కెలు ఎక్కువగా ఉన్నప్పుడు వద్దని నిరాకరిస్తుంది. ఒక్కసారి అలా వద్దని చెప్పగానే ఇక నేను ఆమెను అడుగను. 
 
అలాగే... మా బెడ్రూంలో స్నానం చేసిన తర్వాత ఆమె దుస్తులు లేకుండా అలానే గదిలోకి వచ్చేసి దుస్తులు మార్చుకుంటుంది. నన్ను కూడా అలాగే చేయమంటుంది. నాకు సిగ్గెక్కువ. నేనలా చేయనని చెప్పేస్తున్నాను. కానీ ఆమెకు నన్ను అలా చూడాలని ఉందట. అంతేకాదు... ఓరల్ సెక్స్ కూడా నాకు ఎంతగానో ఎంజాయ్ చేయాలని ఉంటుంది. కానీ సెక్స్ పరంగా బాగా ఎక్జైట్ అయినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో ఆమె ఎంతమాత్రం అంగీకరించడంలేదు. మా ఇద్దరి అభిప్రాయాలు కలిసేదెప్పుడు... మేము సెక్సులో ఎంజాయ్ చేసేదెప్పుడు...?
 
భార్యాభర్తల మధ్య దాంపత్యానికి సంబంధించి నిర్మొహమాటంగా చర్చించుకోవడం తప్పనిసరి. ఆమె నిరాకరించిందని మీరు ఉడుక్కుని, మీరు అలా చేయడం లేదని ఆమె ఉడుక్కుంటూ ఉంటే ఇలాగే ఉంటుంది. ఇద్దరిలోనూ ఒకరి అభిప్రాయాలను ఒకరు పాటించాల్సిన అవసరం ఉంది. ఆమె అడిగినట్లు ఓసారి చేయండి. ఆ తర్వాత మీరడిగినట్లు ఆమె కూడా చేస్తుంది. ఒక మెట్టు దిగి ఇద్దరూ సహకారమందించుకుంటే అంతా సవ్యంగా జరిగిపోతుంది.