గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 14 ఆగస్టు 2015 (13:44 IST)

ఆయనకు అది స్తంభించడం లేదు... నరకం చూపిస్తున్నాడు...

మా పెళ్లై ఏడాది గడిచింది. నాకు మొదట్లో ఏమీ తెలియలేదు. కానీ రానురాను విషయం బోధపడింది. అదేమిటంటే ఆయనకు అంగం స్తంభించడంలేదు. సెక్స్ చేసేందుకు నాపైకి వస్తారు కానీ ఏమీ చేయకుండానే ఉండిపోతారు. నాలో సెక్స్ కోర్కెలు తారాస్థాయికి తీసుకెళ్లి వదిలేస్తున్నారు. రోజూ నరకం చూస్తుంటాను. ఆ బాధ భరించలేక ఓసారి సెక్స్ చేయమని బాగా ఒత్తిడి చేశాను. దాంతో ఆయన నిజం చెప్పాడు. 
 
ఆయన సంసారానికి పనికి రారట. యుక్త వయసు నుంచే ఈ బలహీనత ఉందట. ఇది వారి ఇంట్లో కూడా తెలుసట. ఐతే నా తల్లి చిన్నప్పుడే చనిపోయింది. నాన్నగారు మరో వివాహం చేసుకున్నారు. దాంతో నన్ను వదిలించుకునేందుకు ఇలాంటి సంబంధం నా సవతి తల్లి చేసింది. మొదట్లో అసలీ సంబంధాన్ని వద్దన్నాను. ఐనా పట్టుబట్టి పెళ్లి చేశారు. ఏ సుఖమూ ఇవ్వలేని నా భర్త వద్ద ఉండటం ఇష్టంలేదు. ఇతడి నుంచి బయటపడేదెలా..? 
 
బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేశారని అంటున్నారు. అతడు సంసారానికి పనికిరాడని కూడా చెపుతున్నారు. కనుక ఈ విషయాలన్నిటినీ వివరిస్తూ మీరు కోర్టులో విడాకుల పిటీషన్ దాఖలు చేయండి. మీరు చెప్పిన విషయాలన్నిటినీ కోర్టులో మీరు నిరూపించగలిగితే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన రీతిలో జీవితాన్ని గడపవచ్చు. ఐతే మీ సవతి తల్లి వదిలించుకునేందుకే ఈ పెళ్లి చేసిందంటున్నారు కాబట్టి ఏదైనా ఉద్యోగం చూసుకుని మీ స్వశక్తితో మీరు జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. కాబట్టి దీని గురించి కూడా బాగా ఆలోచన చేయండి.