గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 24 ఆగస్టు 2015 (17:01 IST)

ఓ మహిళతో శారీరకంగా కలిశాను... భయం వేసి ఆమెకు టెస్ట్ చేయించా... కానీ...

నా వయసు 30 ఏళ్లు. రెండేళ్ల క్రితం నేను ఓ మహిళతో శారీరకంగా కలిశాను. ఆమెకు హెచ్ఐవీ ఉందేమోననే అనుమానంతో ఆమెకు ఆ పరీక్ష కూడా చేయించాను. ఇంకా ఇతర పరీక్షలు కూడా చేయించాను. అన్నీ నెగటివ్ అని వచ్చాయి. ఆ తర్వాత నా భార్యకు కూడా పరీక్షలు చేయించాను. ఆమెదీ నెగటివ్ అని వచ్చింది. ఐతే విండో పీరియడ్ అనేది ఒకటి ఉంటుందనీ, ఆ సమయంలో వ్యాధి ఉన్నా బయటపడదని స్నేహితులు అంటున్నారు. అసలీ విండో పీరియడ్ అంటే ఏమిటి... ఎన్నాళ్లుంటుంది....?
 
వివాహేతర సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఇలా జీవితంలో భయపడాల్సి వస్తుంది. భార్యతో కాకుండా మరో మహిళతో సెక్స్ సంబంధం పెట్టుకోవడం వల్లనే ఇలా ఎయిడ్స్ వ్యాధి వస్తుందన్న భయంతో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. కండోమ్ వాడితే ఇలాంటి భయం ఉండదు. కండోమ్ ధరించకుండా సెక్స్ చేసినట్లయితే ఎయిడ్స్, హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ విండో పీరియడ్ కొన్ని వారాల నుంచి 6 నెలల వరకూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అప్పటివరకూ ఆగిన తర్వాత మరోసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు అన్ని విధాలా సమస్యలను సృష్టిస్తాయి కనుక వాటికి దూరంగా ఉండటం మంచిది.