శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 26 ఆగస్టు 2015 (15:58 IST)

ఆమె 2 నెలల గర్భిణీ... ఇపుడు మళ్లీ నేను కలిస్తే మరో గర్భం వస్తుందా...?

నా భార్య అంటే నాకు చెప్పలేనంత ప్రేమ. ఆమెను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. అందుకనే చేసే ఉద్యోగాన్ని వదిలేసి ఆమెతో ఉండాలని వ్యాపారం చేస్తున్నాను. దేవుడి దయ వల్ల వ్యాపారం బాగానే సాగుతోంది. ఇపుడు నా భార్యకు రెండో నెల. ఐతే గర్భిణీ అయిన స్త్రీతో సెక్సు చేయడం వల్ల కడుపులో బిడ్డకు ప్రమాదం అని విన్నాను. నా సమస్య ఏంటంటే... నా భార్యతో సెక్స్ చేయనిదే నాకు నిద్రపట్టదు. ఆమెతో ఒకవేళ మునుపటిలా సెక్స్ చేస్తే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉంటుందా..? ఇప్పటికే గర్భవతి అయిన నా భార్య మళ్లీ నేను సెక్స్ చేయడం వల్ల కడుపులో మరో బిడ్డ ఏర్పడే అవకాశం ఉంటుందా...?
 
మీ భార్య పట్ల మీకున్న ప్రేమ చాలా ఉన్నతమైనది. ఇక దాంపత్యం విషయానికి వస్తే 5 నెలలు నిండే వరకూ స్ట్రోక్స్ గట్టిగా ఇవ్వకుండా సెక్సులో పాల్గొనవచ్చు. ఆ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే, గర్భిణీ అయిన స్త్రీతో సెక్సులో పాల్గొంటే మళ్లీ రెండోసారి గర్భవతి అవడం చాలా అరుదు. అలాంటి పరిస్థితి దాదాపు జరుగదు. 
 
ఎందుకంటే మొదటిసారి గర్భం ధరించినప్పుడే కడుపులో ఉన్న పిండానికి ఎలాంటి ఆటంకం కలుగనీయకుండా గర్భంలో ఏర్పాట్లు ఉంటాయి. ముఖ్యంగా పురుషుడు లైంగికంగా కలిసినప్పటికీ అప్పటికే గర్భం ధరించి ఉన్న మహిళ మరలా రెండో గర్భాన్ని ధరించడం జరిగే అవకాశం చాలాచాలా తక్కువ.