శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 29 ఆగస్టు 2015 (18:14 IST)

నేను కింద ఆమె పైన... అలా పాల్గొంటే అదేమైనా దెబ్బతింటుందా... ఫ్రెండుకు పాడయ్యిందట...

నాకు వివిధ భంగిమల్లో సెక్స్ చేయడం అంటే చాలా ఇష్టం. నా భార్యను అలా ప్రోత్సహించి వేస్తుంటాను. ఈమధ్య ఎక్కువగా ఆమె పైన నేను కింద ఉన్న భంగిమలో, ఆమె నాపై కూర్చున్న స్థితిలో సెక్సులో పాల్గొంటున్నాను. అలా చేయడం వల్ల పురుషాంగానికి ప్రమాదం ఉంటుందనీ, దెబ్బతినే అవకాశం ఉందని నా స్నేహితుడు చెపుతున్నాడు. ఓసారి అతడు ఇలా పాల్గొంటే గబుక్కున స్లిప్పయి అక్కడ గాయమైందట. దాన్నుంచి కోలుకునేందుకు వాడికి చాలా రోజులు పట్టిందట. అసలు అలాంటి భంగిమలో సెక్స్ చేస్తే ప్రమాదం ఉందా..?
 
ఇందులో నిజం లేకపోలేదు. ముఖ్యంగా పురుషుడి పైన కూర్చున్న భంగిమలో స్త్రీ సెక్స్ చేసేటపుడు అతడి వ్యక్తిగత ప్రదేశంపైనే బరువంతా పడుతుంది. అందువల్ల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఓ అధ్యయనం ప్రకారం... స్త్రీ, పురుషునిపైన కూర్చున్న భంగిమలో సెక్సులో పాల్గొంటే 50 శాతం పురుషాంగ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలింది. 
 
అలాగే స్త్రీ డాగా స్టయిల్లో... అంటే రెండు చేతులు, రెండు కాళ్లపై బరువు ఉంచి పురుషుడి పైకొచ్చి చేసే సెక్స్ వల్ల 29 శాతం గాయాలయ్యే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇక పురుషుడు పైన స్త్రీ కింద ఉండే భంగిమలో అతి తక్కువగా 20 శాతం గాయాలు అయ్యే అవకాశం ఉందని తేలింది. ఐతే ఇవన్నీ చాలా అరుదుగా జరుగుతుంటాయని కూడా తెలిపారు. సెక్సులో పాల్గొనేవారు మరీ మొరటుగా వ్యవహరించినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు.