శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 2 సెప్టెంబరు 2015 (20:51 IST)

నాకో బేబీని కనివ్వు... ఆమెలో అమ్మను చూస్కుంటా అంటున్నాడు... కానీ...

మేమిద్దరం గత ఏడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాం. మేముంటున్న నగరంలో ఓ మంచి ఇల్లు, కారు, ఇంకా కావల్సిన లగ్జరీస్ అన్నీ అమరాక పెళ్లాడుదామనుకుంటున్నాం. ఐతే ఈమధ్యనే నా బోయ్ ఫ్రెండ్ తల్లిగారు చనిపోయారు. అప్పట్నుంచి అతడు నాతో ఇంటిమేట్‌గా మూవ్ అవ్వడంలేదు. దీనికి ఓ కారణం ఉంది. తన తల్లి లాంటి బేబీ కావాలనీ, అందుకు ఇద్దరం సెక్సులో పాల్గొందామని ఒత్తిడి చేశాడు. దానికి నేను నో చెప్పాను. పెళ్లయ్యాక చూద్దాంలే అన్నాను. ఇక అప్పట్నుంచి అతడు నాతో సరిగా ఉండటం లేదు. కానీ నాకిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు. అతడిని అలా చూడటమూ ఇష్టం లేదు. పెళ్లి కాకుండా బేబీని ఇవ్వడం కరెక్టేనా...?!!
 
కరెక్టు కానే కాదు. అలాగే డేటింగ్ అనేది కూడా. ఇలాంటివి పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంటాయి. హైఫై సెలబ్రిటీల్లో కొందరిలోనూ ఇలాంటివి ఉండవచ్చునేమో కానీ ఇక్కడ ఇలాంటివి దాదాపు కనబడవు. అతడికి బేబీని ఇచ్చి తృప్తి పరచాలని మీరు అనుకుంటే వెంటనే పెళ్లి చేసుకుని అతడి కోర్కెను తీర్చండి. అతడికి, మీకు అది చాలా మంచిది.