శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 12 సెప్టెంబరు 2015 (16:39 IST)

దాని పొడవు గురించే మాట్లాడుతారు... ఎలా ఉందని పదేపదే అడుగుతారు... ఎందుకిలా...?

మా పెళ్లయి ఏడాది దాటిపోయింది. ఐతే నా భర్త మాత్రం పెళ్లయిన దగ్గర్నుంచి నన్ను ఒకే ఒక్క ప్రశ్నతో విసిగిస్తున్నారు. సెక్సులో పాల్గొనేటపుడు పురుషాంగ పరిమాణం గురించి పదేపదే అడుగుతుంటారు. సెక్స్ చేస్తూ ఆ పరిమాణం నీకు సరిపోతుంది కదా... తృప్తిగా ఉందా లేదా... ఒకవేళ లేకపోతే చెపితే తగిన చికిత్స తీసుకుంటానంటాడు. నేనసలు దాని గురించి పట్టించుకోను. ఆయనకెందుకు అలాంటి ఆందోళన... అతడేమైనా ప్రత్యేకించి ఆ విషయంలో ఏమైనా బలహీనతగా ఉన్నాడా..? 
 
ప్రపంచంలో ఉన్న పురుషుల్లో చాలామందిని వేధించే సందేహం ఇదే. తమ పురుషాంగం చాలినంత పొడవు ఉందో లేదోనని అనకుంటూ ఉంటారు. ముఖ్యంగా సెక్స్ వద్దకు వచ్చేసరికి ఈ విషయంపై మరింత ఆందోళన పెరుగుతుంది. సెక్సులో పొరబాటున విఫలమైతే ఇక పురుషాంగం పొడవు తదితర విషయాలపై చింతిస్తుంటారు. కానీ... స్త్రీ యోనిలో సెక్స్ పరంగా ఉద్రిక్తత చెందే నాడులు 2 అంగుళాల లోతులోనే ఉంటాయని సెక్సాలజిస్టులు చెప్పినా వీరికి భయం వదలదు. అలాగే పురుషాంగం ఎంత పొడవు ఉన్నది ముఖ్యం కాదు... అది స్తంభిస్తుందా లేదా అనేదే ముఖ్యం. కాబట్టి దీనిగురించి అధికంగా ఆలోచన చేయడం అనవసరం.