శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 12 సెప్టెంబరు 2015 (19:12 IST)

భర్తను వదిలేసిన పెద్దింటి అమ్మాయిని చేసుకున్నా... కావాలంటే బోర్ అంటుంది... కోర్కెతో వేధిస్తుంది...

పెద్దింటి అమ్మాయి తను. ఐతే భర్తను వదిలేసింది. పెద్దింటి అమ్మాయి కాబట్టి సుఖపడతానని ఆమెను పెళ్లి చేసుకున్నాను. పెళ్లయ్యాక తెల్సుకున్నాను ఆమె నాకంటే ఐదేళ్లు పెద్దది. ఇంకో విషయం ఏంటంటే.... భర్తతో విడిపోయాక మరొక వ్యక్తితో కొన్నేళ్లు లైంగిక సుఖం చవిచూసిందట. అలా చూస్తే ఆమెకు సెక్సులో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. నేను సెక్సు క్రియలో ఇదే తొలి అనుభవం. నాకు సెక్స్ కావాలని దగ్గరికెళితే... అనుభవించి అనుభవించి బోర్ కొట్టింది. ఇంకేం సెక్స్ చేస్తావ్ అని ఈసడించుకుంటుంది. ఎప్పుడైనా ఓ రోజు ఆమెకు కోర్కె కలిగితే నన్ను వేధించి మరీ తన కోర్కె తీర్చుకుంటుంది. ఈమెతో నేనెలా నెట్టుకురావాలో అర్థంకావడం లేదు...
 
ఇది అన్యాయం. దాంపత్యంలో సెక్స్ అనుభవం అనేది స్త్రీపురుషులకిరువురికీ సమాన హక్కే. అటువంటి హక్కును ఆమె కాలరాస్తోంది. తనకు అవసరమైనప్పుడే మీ వద్ద నుంచి సెక్స్ సుఖాన్ని చవిచూస్తోంది. దీన్నిబట్టి ఆమె మిమ్మల్ని ఓ బానిసలా చూస్తోంది. కాబట్టి మీ అసహనాన్ని ఆమె ముందు వ్యక్తపరిచి సెక్స్ సుఖాన్ని ఇవ్వాల్సిందేనని చెప్పండి. లేదంటే వివాహ బంధం నుంచి వేరుపడతానని హెచ్చరించండి. ఆమె తప్పకుండా మీ మార్గానికి వచ్చే అవకాశం ఉంటుంది.