బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 16 సెప్టెంబరు 2015 (18:29 IST)

ఎంత నిలిపి ఉంచుదామన్నా నిలవడంలేదు... ఐదు నిమిషాలకే ఔట్...

నాకు త్వరలో పెళ్లి కాబోతోంది. అందమైన అమ్మాయిలను చూస్తే అంగం స్తంభిస్తుంది. కొన్నిసార్లు హస్తప్రయోగం కూడా చేస్కుంటాను. ఐతే ఈమధ్య నాకో భయం పట్టుకుంది. హస్త ప్రయోగం చేస్కునేటపుడు అంగం స్తంభన ఐదు నిమిషాలే ఉంటుంది. ఆ తర్వాత వెంటనే మెత్తబడిపోతోంది. ఎన్నిసార్లు చూసినా ఇలాగే ఉంటుంది. ఇలా ఉంటే నువ్వు సంసార సుఖానికి పనికిరావని ఫ్రెండ్ అంటున్నాడు. భార్యను సుఖపెట్టలేనని చెపుతున్నాడు. ఇది నిజమేనా...?
 
సమస్యను చూస్తుంటే అది శీఘ్రస్ఖలన సమస్య కానీ లేదంటే అంగ స్తంభన సమస్య కానీ అయి ఉండవచ్చు. సెక్స్ నిపుణుడి వద్దకు వెళితేగానీ అసలు సమస్య ఏమిటో తేలదు. సెక్స్ ఉద్దీపనలు మానవుని మెదడు నుంచి పుడుతాయి. తగినంత సెక్స్ ఉద్దీపన కలిగితే అంగస్తంభన బాగానే ఉంటుంది. సెక్స్ సమయంలో కొందరిలో అంతకుముందు ఉన్నప్పటికీ చేసేటపుడు రాకుండా పోతుంది.