శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 16 సెప్టెంబరు 2015 (19:51 IST)

అంతా బయటకు వచ్చేస్తోంది... ఆమె ఆందోళన చెందుతోంది... ఎలా?

నా వయసు 21 సంవత్సరాలు. మా అమ్మనాన్నలు నేను వద్దంటున్నా 21 ఏళ్లు నిండాయని చేసేశారు. నా భార్య చాలా అందగత్తె. ఆమె వయసు 19 ఏళ్లు. మొదట పెళ్లి వద్దన్నవాడిని పెళ్లి కాగానే నా తల్లిదండ్రులు చేసింది కరెక్టే అనిపిస్తుంది. ఐతే ఇప్పుడు నన్నో సమస్య వేధిస్తోంది. నా భార్యతో నేను సెక్స్ చేస్తుంటే ఎంతో మధురమైన అనుభూతి కలుగుతుంది. ఆ ఆనందంతో ఇద్దరికీ కళ్ల వెంట నీళ్లొస్తాయి. ఐతే సెక్స్ ముగిశాక చూస్తే నేను స్ఖలించిన వీర్యం అంతా యోనిలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది చూసి నా భార్య ఆందోళన చెందుతోంది. ఇలా వీర్యం యోనిలో నిలువకపోతే పిల్లలు పుడతారో పుట్టరో అని భయపడుతోంది. ఆమె అనుకుంటున్నట్లే వీర్యం మొత్తం బయటకు వచ్చేస్తుందా...?
 
మీరు సెక్సును బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే సెక్స్ పూర్తయ్యాక వీర్యం మొత్తం బయటకు రావడం అనేది జరుగదు. సెక్సులో పాల్గొన్నప్పుడు యోనిలోనూ, యోని ద్వారం దగ్గర స్రవాలు ఊరుతుంటాయి. సెక్సులో బాగా ఎంజాయ్ చేసేవారికి ఇవి మరీ ఎక్కువగా ఊరుతాయి. సెక్స్ ముగిశాక ఇలా ఊరిన ద్రవాలు బయట కనబడుతుంటాయి. వీటినే చూసి వీర్యం వచ్చేస్తుందని కొందరు అనుకుంటారు. ఒకవేళ వచ్చినప్పటికీ వీర్యం మొత్తం బయటకు రాదు. పిల్లలు పుట్టేందుకు అవసరమైన వీర్యం యోని లోపలే ఉండిపోతుంది. కనుక ఎలాంటి ఆందోళన చెందక సెక్సును ఎంజాయ్ చేయవచ్చు.