బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 23 సెప్టెంబరు 2015 (16:12 IST)

ఒక్క నిమిషంలోనే ఔటైపోతున్నారు... ఇలాంటి విషయాలు డాక్టరు వద్ద ఎలా చెప్పమంటావ్ అంటున్నారు...

మా పెళ్లయి ఏడాది దాటింది. మేమిద్దరం సెక్స్ సమస్యల గురించి ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. ఎందుకనో ఈమధ్య నా భర్త సెక్స్ ఎక్కువసేపు చేయలేకపోతున్నారు. ఒక్క నిమిషంలోనే వీర్యస్ఖలనమైపోతోంది. మాకు ఎలాంటి బాధలు, సమస్యలు లేవు. ఆందోళనలు కూడా లేవు. కానీ ఆయనలో ఇలాంటి మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. డాక్టరు వద్దకెళ్లి మందులు ఏమయినా తీసుకోమని చెప్తే వెళ్లడంలేదు. ఇలాంటి విషయాలు డాక్టరు వద్ద ఎలా చెప్పమంటావ్ అంటున్నారు. అందుకని సహజసిద్ధంగా ఈ సమస్యను అధిగమించేందుకు ఏమైనా పదార్థాలున్నాయా... లేదంటే ఆయన ఖచ్చితంగా డాక్టరు వద్దకు వెళ్లాల్సిందేనా...?
 
శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదిస్తారు. కానీ దాంపత్య విషయంలోకి వచ్చేసరికి చాలామంది ఇలాగే సిగ్గుతో విషయాన్ని చెప్పకుండా ముదరబెట్టుకుంటారు. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. శరీరంలో తలెత్తే అన్ని అనారోగ్య సమస్యల్లానే ఇది కూడా ఒకటిగా భావించాలి. సమస్యను ఇలాగే సాగిస్తే అది మరీ జఠిలమవుతుంది. 
 
 
ఇకపోతే సహజసిద్ధంగా కొన్ని పదార్థాలకు శీఘ్రస్ఖలన సమస్యను ఎదుర్కొనేవి ఉన్నాయి. సపోటా పళ్ళను తేనెతో కలిపి తీసుకుంటే శీఘ్రస్ఖలనం తగ్గి, రతి సామర్థ్యం పెరుగుతుందని వైద్యులు చెపుతారు. ఒక సపోటాలో దాదాపు 100 కేలరీల శక్తి వుంటుంది. వంద గ్రాముల సపోటాలో పిండి పదార్థాలు 22.19 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు, ప్రొటీన్లు 0.6గ్రాములు, క్యాల్షియమ్ 1.9గ్రాములుంటాయి. ఐతే మధుమేహవ్యాధి వున్న వారు వైద్యుల సలహా లేనిదే ఈ సపోటాను తీసుకోకూడదు.
 
వీటిని తీసుకున్నప్పటికీ ఆయనలో సమస్య కనిపిస్తుంటే వైద్యుడిని సంప్రదించేందుకు సిగ్గుపడకుండా వెళ్లి చూపించుకోమని చెప్పండి.