గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2015 (22:23 IST)

ఆంటీతో నేను చేసిన పని నా సోదరుడికి తెలిసిపోయింది... వాడు చెప్పేస్తాడేమో...?

మా ఇంటి ఎదురుగా నాలుగేళ్ల క్రితం అద్దెకు దిగిన ఆంటీతో అనుకోని పరిస్థితుల్లో సెక్సులో పాల్గొన్నా. ఆ తర్వాత నాలుగైదుసార్లు అది కొనసాగింది. ఆ తర్వాత వారు మరో ఊరికి వెళ్లిపోయారు. ఇప్పుడు నా వయసు 23 సంవత్సరాలు. ఇప్పుడు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా మళ్లీ పాత ఆంటీ వచ్చేసింది. 
 
మా ఇంటి పక్క వీధిలో దిగినట్లు చెప్పింది. ఆమె మళ్లీ సెక్సులో పాల్గొందామని అడిగింది. ఈ విషయం మా ఇంట్లో నా సోదరుడికి తెలిసిపోయింది. వాడు మా పేరెంట్స్‌కు చెబితే నాకిక పెళ్లి చేయరేమోనని భయంగా ఉంది. ఆంటీ నా పరిస్థితిని పట్టించుకోవడంలేదు. ఎప్పటిలానే వస్తూపోతూ ఉన్నది. ఏం చేయాలి...?
 
యవ్వనంలో ఉన్నప్పుడు సెక్స్ కోర్కెలను అదుపులో పెట్టుకోవాలి. అలాకాకుండా పరాయి స్త్రీలతో లైంగిక సంబంధాలను పెట్టుకుంటే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయి. ఆమెతో సెక్సులో పాల్గొన్నప్పుడు లైంగిక కోర్కెల ఆవేశంలో పాల్గొన్నారు. కానీ యవ్వనంలో వాటిని అదుపులో ఉంచుకోవాలి. అలాకాకుండా చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది. కుటుంబ సభ్యులకు విషయం తెలియకుండా ఉండదు. వారే మీ జీవితంపై ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆందోళన చెందకండి.