శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (19:43 IST)

ఫోర్ ప్లేనేగా... వేరే పెళ్లి చేస్కో అంటున్నాడు... ఏం చేయాలి?

మేమిద్దరం గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. కానీ శారీరకంగా ఏకం కాలేదు. కానీ ఈమధ్య ఓసారి సినిమాకెళ్లినప్పుడు నా బాయ్ ఫ్రెండ్ ఏదేదో చేశాడు. లైంగికంగా ఉద్రిక్త చెందేట్లు ఫోర్ ప్లే చేశాడు. అప్పట్నుంచి అతడు చేసినవే గుర్తుకొస్తున్నాయి. సెక్స్ కోర్కెలు కలిగినా పెళ్లికి ముందు అలాంటి వాటికి దూరంగా ఉండాలని అతడిని దూరం పెట్టేశాను. ఏడాది నుంచి ఒకరికొకరు దూరంగా ఉన్నాం. నాకు ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు. తనకి కూడా వస్తున్నాయట. 
 
మేమిద్దరం మా పేరెంట్స్‌కి మా ప్రేమ విషయం చెప్పలేదు. ఇప్పుడు చెప్పినా వారు ఒప్పుకోరు. ఎందుకంటే... నన్ను చేస్కోబోయే అబ్బాయి మంచి ధనవంతుల ఫ్యామిలీ. అతడి కుటుంబం పేద కుటుంబం. ప్రేమ వ్యవహారాన్ని చెప్పేద్దామని అంటే అతడు ఒప్పుకోవడంలేదు. మరి మనమధ్య జరిగిన ఫోర్ ప్లే అని అడిగితే... ఫోర్ ప్లేనే కదా... అదో పీడకలలా మర్చిపో. నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండు అంటున్నాడు. ఏం చేయాలో తెలియడంలేదు...
 
ఇరువురు పరస్పరం ప్రేమలో పడిన తర్వాత, ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడినప్పుడు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు వెంటనే చెప్పేస్తే మీ పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. ఇప్పుడు చేయిదాటి పోయింది. తల్లిదండ్రులు మీ విషయం తెలియక వేరే సంబంధాలను చూస్తున్నారు. ప్రేమించినవాడు కూడా మీకు వస్తున్న సంబంధాలతో పోల్చుకుని తనను అల్లుడిగా మీ తల్లిదండ్రులు ఒప్పుకోరని అనుకుంటున్నాడు. కనుక ఇప్పటికిప్పుడు మీ తల్లిదండ్రులకు మీరు చెబితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ ఎంతో శ్రమపడి మీరు ఒప్పించినా మీ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటాడో లేదో అదీ తెలియదు. కనుక పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించండి.