గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 5 నవంబరు 2015 (20:21 IST)

నా గర్ల్ ఫ్రెండ్ నాకు తెల్లవార్లూ ఫోన్లు చేసి నిద్రపోనివ్వడం లేదు...

మేమిద్దరం ప్రేమికులం. ఎలాగోలా పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి మరో 6 నెలలు తర్వాత పెళ్లాడాలనుకుంటున్నాం. ఐతే అప్పటిదాకా ఇద్దరం సెక్స్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాం. అందుకని నేను కండోమ్ ధరించి సెక్స్ చేయబోతుంటే నా గర్ల్ ఫ్రెండ్ ఊరుకోవడం లేదు. కండోమ్ పీకేసి మామూలుగా చేయమంటోంది. అలా చేసి వీర్యస్ఖలనం అయిన తర్వాత తనకు గర్భం వస్తుందేమోనని భయంగా ఉందని తెల్లవార్లూ ఫోన్లు చేసి నిద్రపోనివ్వడం లేదు. పోనీ సెక్స్ వద్దంటే మాట వినడం లేదు. ఏదయినా మార్గం ఉందా...?
 
కండోమ్ లేకుండా సెక్సులో పాల్గొంటే ఖచ్చితంగా గర్భం వస్తుంది. ఈ విషయాన్ని ఆమెకు నచ్చజెప్పండి. సెక్సులో పాల్గొనేటపుడు సెక్స్ సుఖాన్ని చవిచూసి ఆ తర్వాత గర్భం వస్తుందని గొడవ చేస్తే రాకుండా పోతుందా..? కనుక ఈ విషయాన్ని ఆమెకు సావధానంగా చెప్పి ఒప్పించండి. ఎలాగూ 6 నెలల తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కనుక అప్పటివరకూ మరో పద్ధతిని అనుసరించండి. పైగా పెళ్లికి ముందు ఇలాంటివి చిక్కులను తెచ్చిపెడతాయి. ముందు పేరెంట్స్‌ను ఒప్పించి సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నం చేయండి.