గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 10 నవంబరు 2015 (16:41 IST)

ఈమెతో సెక్స్ కాదని ఆమెను ఎందుకు కావాలనుకుంటున్నానో అర్థం కావడం లేదు..?

మా ఇంటి పక్కింటి యువతి చాలా బ్యూటీ. ఆమెతో సెక్స్ కావాలని ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్నా. చివరికి ఎంతో ప్రయత్నించిన మీదట ఆమె సరే అంది. ఐతే ఆమె అలా అన్న తర్వాత నుంచి నాకు ఓ రకమైన ఫీలింగ్ కలుగుతోంది. నాకు ఇప్పటికే పెళ్లయింది. నా భార్య కూడా ఆమెతో సరిసమానంగానే అందంగా ఉంటుంది. మరి ఈమెతో సెక్స్ కాదని ఆమెను ఎందుకు కావాలనుకుంటున్నానో అర్థం కావడం లేదు. అంతేకాదు... నాకు తెలిసినవారిలో ఇద్దరుముగ్గురు ఇలాగే మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అసలు ఎందుకిలా అనిపిస్తుంది...?
 
వివాహేతర సంబంధాలు పలు కారణాల వల్ల ఏర్పడుతాయి. ఒకే రకమయిన అనుభవంతో విసుగుపుట్టడం వల్ల కావచ్చు లేదంటే భార్య నుంచి సరయిన సుఖం లభించక ఏర్పడవచ్చు. ఐతే కొందరు పురుషులు పరాయి స్త్రీ సెక్సుకు అంగీకరిస్తే, ఆమెతో రతి సుఖం ఎలా ఉంటుందో చూడాలన్న థ్రిల్ కోసం పాల్గొంటారు. 
 
ఇకపోతే అవతలి స్త్రీ తనపట్ల ఆకర్షితురాలయి సెక్స్ కోసం ఆరాటపడటాన్ని చూసి తనేదో అందగాడిననీ, తనలోని మగతనాన్ని మరో స్త్రీ కోరుకుంటుంది కనుక దానిని తీర్చాలన్న ఉద్దేశ్యంతో వివాహేతర సంబంధానికి పూనుకుంటారు. ఇంకా కొన్ని కారణాల వల్ల ప్రేమికులు విడిపోవడం, వేరే వివాహం చేసుకున్న తర్వాత తన భాగస్వామితో తృప్తికరమైన సెక్స్ అనుభవాన్ని చవిచూడకపోయిన సందర్భంలో పాత పరిచయం పురివిప్పుతుంది. 
 
ప్రేయసి లేదా ప్రియుడు తన ప్రేమ బంధాన్ని గుర్తు చేసి, తను ఎదుర్కొంటున్న సమస్యను అవతలి వ్యక్తికి చెప్పి ఎలాగోలా ఒప్పించి సెక్స్ సుఖాన్ని అనుభవిస్తారు. ఇవే కాకుండా కొత్తదనం కోరుకోవడం, దంపతుల మధ్య తగ్గే ప్రేమ, ఆకర్షణ, ఆదరణ వంటివన్నీ వివాహేతర సంబంధానికి దారితీస్తాయి. ఐతే ఇలాంటి వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా చేటు తెస్తాయని తెలుసుకోవాలి.