శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 14 నవంబరు 2015 (17:55 IST)

నాకది కావాలన్నప్పుడల్లా ఆమె చూషించి తృప్తి పరుస్తోంది... నాకు భయమేస్తోంది...

మేమిద్దరం నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. నా ప్రేయసి అంటే నాకు ప్రాణం. ఆమెను చూడనిదే ఒక్కరోజు కూడా ఉండలేను. ఆమె కోసం ఏమయినా చేసేందుకు నేను సిద్ధమే. పెళ్లి కోసం మా తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా బలవంతం చేసి ఒప్పించాను. కానీ ఆమె పెళ్లాడేందుకు మరికొన్ని రోజులు కావాలంటోంది. ఆమెకు దగ్గరగా ఉంటూ ఉంటే సెక్స్ కోర్కెలు విపరీతంగా కలుగుతున్నాయి. ఇద్దరం పెళ్లాడి అలా కలిసిపోదామంటే ఆమె ఒప్పుకోవడంలేదు.


మరీ ఒత్తిడి చేసినప్పుడు నా అంగాన్ని చూషించి తృప్తిపరుస్తోంది. నేను సెక్స్ కావాలన్నప్పుడల్లా అదే పనిచేస్తోంది. కొన్నిసార్లు వీర్యం కూడా స్ఖలించేస్తున్నాను. కానీ అంతా ముగిశాక... ఆమెను చూసి జాలి వేస్తోంది. అంతేకాదు... ఆమె ఆరోగ్యానికి ఏమైనా హాని కలుగుతుందేమోనని భయంగా కూడా ఉంటోంది. ఆమె ఎందుకు పెళ్లికి ఒప్పుకోవడంలేదో తెలియడంలేదు... అలాగే ఇలా అంగచూషణ వల్ల ఏమైనా వ్యాధులు సంక్రమిస్తాయా...?
 
పెళ్లిని వాయిదా వేయాల్సిన కారణాలు బహుశా కుటుంబపరమైనవి అయ్యి ఉండవచ్చు. మెల్లగా ఆ కారణాలను కనుగొనేందుకు చూడండి. యవ్వనంలో సెక్స్ కోర్కెలు కలుగడం సహజమే. ఓరల్ సెక్స్ అనేది వ్యక్తిగత భాగం శుభ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. అంగచూషణ సమయంలో ఆ భాగం శుభ్రంగా ఉన్నట్లయితే ఎలాంటి సమస్య ఉండదు. కానీ అశుభ్రతతో ఉంటే ఇన్ఫెక్షన్లు రావచ్చు. కాబట్టి మీ సెక్స్ కోర్కెలకు కళ్లెం వేయడం మంచిది. ఆమెపై ఒత్తిడి చేయడం వల్లనే అలా చేయాల్సి వస్తుందని అర్థమవుతుంది. పెళ్లికి ముందు సెక్స్ మంచిది కాదు.