బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 18 నవంబరు 2015 (18:57 IST)

ఆయన్ని ఆ విషయంలో ఎట్రాక్ట్ చేయలేకపోతున్నందుకు బాధగా ఉంటోంది...

నా వక్ష సంపద చాలా చిన్నది. పెళ్లికి ముందు చిన్నదైన వక్ష సంపదను కాస్త పెద్దదిగా ఉండేందుకు ప్యాడెడ్ బ్రాలు ధరించేదాన్ని. నాకు ఏడాది క్రిత పెళ్లయింది. తొలిరోజుల్లో ఆయన నా వక్ష సంపద గురించి పట్టించుకోలేదు కానీ... ఇప్పుడు తనను మోసం చేశావని అంటున్నాడు. వక్షోజాలు లావుగా లేకపోయినా పెద్దవిగా ఉండేట్లు నాటకమాడి నన్ను పెళ్లి చేసుకున్నావని అంటున్నాడు. నిజానికి నా ఉద్దేశ్యం అది కాదు. ఎద సంపద ఎత్తుగా బావుంటారని అలాంటివి ధరించాను. కానీ ఆయనకు సెక్స్ సమయంలో మూడ్ రావడం లేదట. ఎద సైజులు పెరిగేందుకు ఏమైనా మందులు ఉన్నాయా...? ఆయన్ని ఆ విషయంలో ఎట్రాక్ట్ చేయలేకపోతున్నందుకు బాధగా ఉంటోంది...
 
వక్షోజాల సైజులు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవు. పెళ్లయ్యాక పిల్లలు పుట్టినప్పుడు వాటి ఆకృతులలో మార్పులు వస్తాయి. అప్పుడు చిన్నవి, పెద్దవి.. ఇలా మార్పులు చెందుతుంటాయి. వక్షోజాల క్రింద ఉండే కండరాలకు బలాన్నిచ్చే వ్యాయామం చేయడం వల్ల కొంతవరకు వాటి పరిమాణాన్ని పెంచుకునే వీలుంది. మీ భర్త మరీ అంత అసంతృప్తి చెందుతుంటే కాస్మోటిక్ సర్జన్ సలహా మేరకు ఆగ్‌మెంటేషన్ మామోప్లాస్టీ చేయించుకోండి.