శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 19 నవంబరు 2015 (18:59 IST)

అది రోజూ చేయకపోతే తెగిపోతుందంటున్నాడు.... నిజమేనా...?

నాకు ఇటీవలే పెళ్లయింది. వ్యాపారం చేస్తుంటాను. పని నిమిత్తం ఒక్కోసారి రోజులతరబడి రాలేను. ఈమధ్య నా స్నేహితుడు కలిసి... ఇదేంటి ఇన్ని రోజులు భార్యకు దూరంగా సెక్స్ చేయకుండా ఇంటికి దూరంగా ఉన్నావా... ఇలాగైతే ఆమె నిన్ను ఏదో ఒకరోజు వదిలేస్తుంది. రోజూ సెక్స్ చేయనిదే బంధం బలహీనమైపోతుంది అని చెప్పాడు. నిజంగా రోజూ సెక్సు చేయకపోతే బంధం తెగిపోతుందా...?
 
మీ మిత్రుడు చెప్పినదాంట్లో నిజం లేదు. అతడేదో నోటికి వచ్చింది చెప్పాడు. సెక్సులో రోజూ పాల్గొన్నా కొందరు భార్యాభర్తలు కీచులాడుకుంటూ ఉంటారు. అలాగని 15 రోజులకొకసారి పాల్గొనేవారు చాలా అన్యోన్యంగా కనబడుతారు. దీనికి కారణం ఒకరిపట్ల ఒకరికి ఉండే ప్రేమాభిమానం. సెక్స్ చేస్తేనే కలిసి ఉంటారనేది నిజం కాదు. రోజూ సెక్స్ చేయకపోయినా వారం రోజులకోసారి చేసినా బంధం గట్టిగా ఉంటుందని ఇటీవల అధ్యయనాలు కూడా నిరూపించాయి. కాబట్టి మీరేమీ ఆందోళన చెందనక్కర్లేదు.