బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 21 నవంబరు 2015 (13:54 IST)

నా భర్త స్నేహితుడు భుజంపై చేయి వేస్తున్నాడు... అక్కడ కూడా...

మా పెళ్లయి 8 ఏళ్లయింది. సంతోషంగా ఉంటున్నాం. ఈమధ్య నా భర్త చిన్ననాటి స్నేహితుడొకరు ఉద్యోగ బదలీపై నగరానికి వచ్చేశారు. తరచూ నా భర్త అతడిని ఇంటికి తీసుకువస్తున్నారు. ఐతే అతడు నా భర్త లేని సమయంలో కూడా ఇంటికి వస్తున్నాడు. పైగా భోజనం పెట్టమని స్వతంత్రంగా అడిగేస్తున్నాడు. ఓ రోజు నేరుగా లోపలికి వచ్చి భుజంపై చేయి వేసి ఆకలి వేస్తుంది త్వరగా పెట్టు అంటూ అడిగాడు. 
 
అతడి చేతి స్పర్శలో నాకు తేడా కనిపించింది. ఆ తర్వాత కూడా రెండుమూడుసార్లు పట్టుకోకూడని చోట చేతిని తగిలించాడు. అతడి వ్యవహారంపై నాకు కోపం వచ్చినా నా భర్త స్నేహితుడని వదిలేశాను. ఈమధ్య వాట్సప్‌లో పిచ్చిపిచ్చి ఫోటోలను, ద్వంద్వార్థాల సందేశాలను కూడా పంపుతున్నాడు. ఇలాగే వదిలేస్తే అతడు ఎంతదూరం వస్తాడోనని భయంగా ఉంది. నా భర్తతో ఈ విషయం చెబితే వాళ్ల ఫ్రెండ్ షిప్ దెబ్బతింటుందని ఆవేదన చెందుతున్నా. ఒకవేళ నేరుగా ఈ విషయాన్ని అతడికి చెబితే ఎలాంటి సమస్య ఎదురవుతుందోనన్న అనుమానం కూడా ఉంది. ఏం చేయను...?
 
ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా అతడి ప్రవర్తన మార్చుకోమని చెప్పండి. అలాంటి పిచ్చి చేష్టలు చేస్తే మర్యాదగా ఉండదని చెప్పాల్సిందే. భర్త ఫీల్ అవుతారని వదిలేస్తే పరిస్థితి చేయిదాటి పోతుంది. అంతగా అతడితో చెప్పేందుకు మీకు ఇబ్బంది అనిపిస్తే విషయాన్ని భర్తకు చెప్పడంలో తప్పేమీలేదు. స్నేహం కంటే మీ సంసారం ముఖ్యం కదా.