గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 23 నవంబరు 2015 (17:49 IST)

నాకు 17 ఏళ్లప్పుడే సెక్స్ ఎందుకు చేయలేదని అడుగుతోంది...

ఆమెను 14 ఏటలోనే ప్రేమించాను. నన్ను కూడా ఆమె ప్రేమించింది. ఐతే మేమిద్దరం ఒకరొకరు దగ్గరయ్యేసరికి ఆమెకు 17 ఏళ్లు వచ్చాయి. ఐతే మేమిద్దరం సెక్సులో పాల్గొనలేదు కానీ ముద్దులు, కౌగిళ్లతో కాలం గడిపేశాము. ఆ తర్వాత ఆమె డిగ్రీ పూర్తి చేసి నేను ఉద్యోగంలో స్థిరపడ్డాక... అంటే ఆమెకు 23 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరికీ పెళ్లయి ఇప్పటికే నాలుగేళ్లయింది. నా భార్య ఇపుడు కొత్తగా ఓ మాట అంటోంది. ప్రేమించుకున్న కొత్తల్లోనే సెక్సును బాగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్లమనీ, అపుడు ఎందుకు చేయలేదని నిలదీస్తోంది. ఆమెలో ఈ హఠత్పరిణామం ఎందుకు వచ్చిందో అర్థం కావడంలేదు. ఎంతసేపటికీ 17 ఏళ్ల నాటి ప్రేమ సంగతులను చెపుతూ కాలయాపన చేస్తోంది. ఆమె ఎందుకిలా మారింది..?
 
ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం యవ్వనంలో టీనేజ్ యువతీయువకులు సెక్స్ సంబంధాలకన్నా చుంబనాలు, ఆలింగనాలనే ఎంతో ముద్దని తేలింది. టీనేజ్‌లో సెక్స్ - ముద్దు, కౌగిళ్లు అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. 
 
ఆరోగ్య రంగానికి చెందిన బేయర్ సంస్థ పరిశోధకులు నిర్వహించిన సర్వేలోను ఇదే విషయం వెల్లడైంది. ఆలింగనం, చుంబనాలు... ఇతరత్రా పనులనే టీనేజ్ జంటలు ఇష్టపడుతారు. కౌగిళ్లు, ముద్దుల విషయంలో అబ్బాయిలు మహా నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నారట. ఇష్టపడిన అమ్మాయి ఏ సోఫాలోనో ఆశీనురాలై ఉన్నప్పుడు అందరి కళ్లూ కప్పి చటుక్కున కౌగలించుకోవడంతోపాటు ముద్దు రుచిని కూడా చూపిస్తున్నారట. 
 
ఇటువంటి పనులతో వారు అమితానందాన్ని పొందుతున్నారని, ఇలాంటి సమయంలో వారికి రతిక్రియలో పాల్గొనాలన్న కోరిక బలీయంగా ఉన్నప్పటికీ దానిని ప్రక్కనపెట్టి మిన్నకుండిపోతున్నారట. కాబట్టి టీనేజ్ వయసులో సెక్స్ చాలావరకూ తక్కువనే చెప్పవచ్చు. ఇకపోతే సెక్స్ పట్ల ఆమె ఇలా చెప్పడాన్ని బట్టి చూస్తుంటే... మీ దినచర్యను కాస్త సరిచూసుకోవాల్సి ఉంటుంది. మీ శృంగారం యాంత్రికంగా మారిపోయిందేమో చెక్ చేసుకోండి. పరిస్థితి చక్కబడుతుంది.