శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : శనివారం, 28 నవంబరు 2015 (22:08 IST)

నాకామంటే ప్రాణం... నాకలా అయ్యింది మర్చిపో అంటోంది... ఎలా?

నాలుగు నెలల క్రితం మా ఆఫీసులో ఓ అందమైన అమ్మాయి ఉద్యోగంలో చేరింది. ఆమె కంటే నా పోస్టు పెద్దదే. ఐనా నాకు స్త్రీలంటే చాలా గౌరవం. ఆమెకేదైనా చెప్పాలనుకుంటే ఓ చీటిలో రాసి పంపేవాణ్ణి. నా పద్ధతి పట్ల ఆమె ఎంతో ముచ్చటపడి ఓరోజు నన్ను అభినందించింది. ఆ తర్వాత నాతో మాట్లాడింది లేదు. కానీ నన్ను చూసినప్పుడు ఒక్క నవ్వు నవ్వుతుంది. చాలా కష్టపడి పనిచేస్తుంది. పెళ్లి చేస్కుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలనిపించింది. 
 
కానీ ప్రపోజ్ చేసేందుకు చాలా టైం పట్టింది. చివరకి ధైర్యం తెచ్చుకుని నేను ప్రేమిస్తున్నాను... పెళ్లి చేసుకుంటానని చెప్పాను. మళ్లీ ఆమె ఓ నవ్వు నవ్వింది. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది. ఎందుకని అడిగితే... తను విడాకులు తీసుకున్నాననీ, అందువల్ల పెళ్లి చేసుకోదలచుకోలేదని అంటోంది. కానీ ఆమెను తప్ప ఇక వేరే ఎవర్నీ పెళ్లి చేసుకోదలచుకోలేదు. నాకామె ఇప్పుడు ప్రాణంతో సమానమైపోయింది. ఆమె జీవితంలో చేదు జ్ఞాపకాలను చెరిపేసి పెళ్లాడితే మా పెద్దలు అంగీకరిస్తారా...?
 
ఆమెను ప్రేమించారు. ఆమె తన జీవితంలో చోటుచేసుకున్న చేదు నిజాన్ని చెప్పేసింది. మీ పెద్దలకు చెప్పడం, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మీ చేతుల్లోనే ఉంది.