శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 21 జనవరి 2015 (14:48 IST)

స్వప్నంలో సినీతార వస్తుంది... వీర్య స్ఖలనమౌతుంది... వేరే అమ్మాయితో పెళ్లయితే...

నేను ఎంతో ప్రేమించే సినీతార నాకు తరచూ కలలోకి వస్తుంది. ఆమెతో సంభోగించినట్లు కొన్నిసార్లు కలలు వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు నిద్రలోనే వీర్య స్ఖలనమైపోతోంది. ఇలాంటి కల రాకూడదని ఎంత అనుకున్నా ఆగడంలేదు. వారంలో ఒక్కసారయినా నా అభిమాన హీరోయిన్ వస్తోంది. ఇపుడు నాకు ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. ఆమెతో పెళ్లయిన తర్వాత కూడా ఇలాగే ఆ హీరోయిన్ కలలోకి వస్తుందా...? అలా వచ్చి వీర్య స్ఖలనమైపోతే ఇక కాబోయే భార్యతో సెక్స్ చేయగలనా... లేదా...?

 
మీది అర్థం లేని భయం. స్వప్న స్ఖలనం చాలామందిలో ఉంటుంది. కాకపోతే వారివారి మానసిక స్థితినిబట్టి ఇవి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా కలలు వస్తుంటాయి. తమకు ఇష్టమైన స్త్రీతో సంభోగించినట్లు యుక్తవయసులో కలలు వస్తుంటాయి. ఐతే, పెళ్లయ్యాక ఇక భాగస్వామితో రమించడం ప్రారంభించాక గతం తాలూకు కలలు చెరిగిపోతాయి. అలాగే స్వప్నంలో వీర్యం స్ఖలించే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.