శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 16 డిశెంబరు 2015 (13:46 IST)

అది వృద్ధులకే కాని నాక్కాదులే అంటున్నాడు... కానీ అతడిది మాత్రం....

ఈమధ్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ప్రేమించే సమయంలో ఛాన్సు దొరికితే నాపై వాలి నానా హంగామా చేసేవాడు. సెక్స్ కావాలంటూ ఎగబడేవాడు. తీరా పెళ్లయ్యాక ఆయనలో ఏదో తేడా ఉందనిపిస్తుంది. ఫోర్ ప్లేతో నన్ను రెచ్చగొట్టి, అంగ ప్రవేశం చేసేందుకు నానా ప్రయత్నాలు చేసి అది వల్లకాక అటు తిరిగి పడుకుంటాడు. ఓరోజు సిగ్గు విడిచి అతడిని ఓ విషయం అడిగేశా. 
 
అంగస్తంభన సమస్య ఉన్నదేమో చెక్ చేయించుకోమని చెప్పా. నేను ఆ మాట అన్నందుకు ఇంతెత్తున లేచి... అది వృద్ధుల్లో ఉంటుంది కానీ నాలాంటి యవ్వనవంతుల్లో ఎలా ఉంటుంది. నాకెలాంటి సమస్య లేదు అన్నాడు. మరైతే ఎందుకు చేయలేకపోతున్నావని అడిగితే... రెండుమూడు రోజుల్లో చక్కబడుతుందని అంటున్నాడు. నిజంగా అంగ స్తంభన సమస్య వృద్ధుల్లోనే ఉంటుందా...?
 
మీవారు అనుకుంటున్నట్లుగా అంగ స్తంభన సమస్య అనేది వృద్ధులకు మాత్రమే పరిమితం కాదు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 40 ఏళ్ల లోపు వారిలో 26 శాతం మంది అంగస్తంభన సమస్య ఉన్నట్లు తేలింది. దీన్నిబట్టి ఆయనలో అంగస్తంభన సమస్య ఉన్నదని అనుమాన పడటం ఏమీ తప్పుకాదు. వైద్యులకి చూపించి తగు వైద్య చికిత్సను తీసుకోండి. సమస్య నుంచి బయటపడతారు.