గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 19 ఆగస్టు 2014 (19:30 IST)

ప్రియురాలికి నా పురుషాంగం ఫోటో పంపించా... ఫోన్ స్విచాఫ్ చేసేసింది...

నేను ఆమె గత ఏడాదిగా ప్రేమించుకుంటున్నాం. ఇప్పటివరకూ ఆమెకు నాకు మధ్య ఎలాంటి శారీరక బంధం లేదు. కేవలం ముద్దులు, కౌగిళ్ల వరకే పరిమితమవుతూ వచ్చాం. ఈమధ్య సెక్స్ కావాలని కోరితే పెళ్లయిన తర్వాతే అని చెప్పింది. కానీ ఆమె ఊహలతో హస్త ప్రయోగం చేసుకోలేకుండా ఉండలేకపోతున్నాను. ఉండలేక... నా పురుషాంగం ఫోటో తీసి ఆమె సెల్ కు పంపాను. అలా పంపిన వెంటనే ఫోన్ చేసి ఆమె స్పందన విందాం అనుకున్నా. కానీ ఫోన్ చేస్తే స్విచాఫ్ చేసేసింది. నాతో మాట్లాడటానికే ఇష్టపడంలేదు. ఈమధ్య వేరే ఊరికి కూడా వెళ్లిపోయింది. పురుషాంగం చూడగానే ఆమె ఎందుకిలా మారిపోయిందో తెలియడంలేదు...
 
ప్రేమికుల్లో కొందరు ఇలాంటి విపరీత ధోరణి ప్రదర్శిస్తుంటారు. ఏ అమ్మాయి కూడా పెళ్లికి ముందు సెక్స్ అంగాలను చూడాలనో, సెక్స్ సుఖాన్ని అనుభవించాలనో కోరుకోదు. మీరు చేసిన పని తదుపరి లక్ష్యం సెక్స్ అని ఆమెకు అర్థమైపోయినట్లుంది. అందువల్లనే మీ ప్రేమకు అర్థం లేదనుకుని అలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. దానిని మీరు సరిదిద్దుకోవడం కష్టమైన పనే.