గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2015 (15:02 IST)

నా స్నేహితులు సెక్స్ కబుర్లు చెబుతుంటే ఫాంటసీలో తేలిపోతున్నా.. తప్పా?

నేను హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చేస్తున్నా. నాతోటి ఆడపిల్లలు తమ క్లాస్‌మెట్స్ (మగపిల్లలు) గురించి కామెంట్స్ చేస్తుంటారు. అలాగే సెక్స్ గురించి మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆరంభంలో ఈ మాటలు వినేందుకు చిరాకు అనిపించినా.. ఇపుడు ఆ మాటలు వినాలని ఆసక్తిగా ఉంది. అంతేకాకుండా, ఒక్కోసారి నాకు ఇష్టమైన యువకులను ఊహల్లోకి తెచ్చుకుని ఫాంటసీతో తేలిపోతూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నా. ఇలా చేయడం తప్పా.? కేవలం ఊహలకే పరిమితం చేసుకుంటున్నా గానీ, స్వయంతృప్తి లేదా శారీరక సంబధానికి దూరంగా ఉంటున్నా. ఈ ఊహల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? 
 
సాధారణంగా కాలేజీ యువతీయువకుల మధ్య సెక్స్ సంభాషణలు రావడం, కబుర్లు చెప్పుకోవడం సహజమే. అలాగే, లైంగిక కబుర్ల పట్ల ఆసక్తి చూపడం సర్వసాధారణం. అదేవిధంగా మనకు నచ్చిన యువకులను ఊహల్లోకి తెచ్చుకుని ఫాంటసీలో తేలిపోవడమూ కామనే. ఒక్కోసారి కలలో మనకు నచ్చిన యువకులతో సెక్స్‌లో పొందడం కూడా అసహజ లక్షణం కాదు. 
 
యుక్త వయస్సులో ఉండే ప్రతి యువతీ యుకుల్లోని సహజ లక్షణం. అయితే, అతిగా సెక్స్ కబుర్లు చెప్పుకోవడం, సెక్స్ గురించి ఆలోచన చేయడం మంచిది కాదు. దీనివల్ల చదువుపై ధ్యాస తగ్గిపోతుంది. తత్ఫలితంగా చదువుపై ఏకాగ్రత కోల్పోయి కెరీర్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది. మీ మనస్సును నిగ్రహం చేసుకుని మంచి భవిష్యత్‌కు పునాది నిర్మించుకోండి.