శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By pnr
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2015 (18:02 IST)

సెక్స్‌లో పాల్గొంటే తలనొప్పి.. జలుబు వంటివి తగ్గుతాయా?

రోజువారీగా దాంపత్య జీవితంలో పాల్గొనే జంటలు ఎంతో ఆనందంగా ఉంటాయని పలువురు తమతమ పరిశోధనల్లో వెల్లడించారు. అంతేకాకుండా, సెక్స్‌లో పాల్గొనే జంటలు సంతోషంగా, చురుకుగానూ ఉంటారని చెపుతున్నారు. అలాగే, సంభోగం అనేది మిమ్మల్ని ఆర్యోగంగా ఉండటానికి సహాయపడుతుంది. ఒక రీసెర్చ్ ప్రకారం రోజువారీ లైంగిక కార్యకలాపాల వల్ల వివాహం అయిన జంటలలో తలనొప్పి, జలుబు వంటి సాధారణ వ్యాధులు తగ్గటానికి సహాయపడుతుందని తెలిసింది.
 
తాజా అధ్యయనం మేరకు సంభోగం సమయంలో మెదడులో రసాయన సమ్మేళనాలు విడుదలై శరీరానికి విశ్రాంతిని కలిగిస్తుందని తెలిసింది. పిట్యూటరీ అని పిలిచే ప్రధాన సమ్మేళనం మహిళల యొక్క రక్తప్రవాహంలోకి విడుదలై ఒత్తిడిని తగ్గిస్తుందట. ఈ హోర్మోన్ ప్రభావం ప్రశాంతత భావనను పెంపొందించి మంచి నిద్రను ప్రోత్సహిస్తుందట. సెక్స్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శృంగారంలో పాల్గొనడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గిస్తుందట. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలో వ్యాధిని నిరోధించడానికి సహాయపడుతుందట. గుండెపోటులను నిరోధిస్తుందట. 
 
సెక్స్ చేయని వారిలో కంటే, ఒక వారంలో రెండు కంటే ఎక్కువ సార్లు సెక్స్ చేసే పురుషులలో స్ట్రోక్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, ప్రతి రోజు సెక్స్ చేయటం వలన రక్తనాళాల ద్వారా రక్తం పంపింగ్ బాగా జరిగి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందన్నారు. అలాగే, వెన్నెముక కింది భాగానికి మంచిది సెక్స్‌లో ఉన్న ఇతర ఆరోగ్య ప్రయోజనాలలో ఇది ఒకటి.