శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (18:29 IST)

కండోమ్ ధరించినా తృప్తి లేక తీసేసి చేశాను... గర్భం వస్తుందేమో...?!!

మేమిద్దరం పెళ్లి చేసుకునేందుకు మరో ఏడాది సమయం ఉంది. ఐతే మొన్న వాలెంటైన్ డే నాడు నా ప్రేయసి, నేను సెక్సులో పాల్గొన్నాము. కండోమ్ ధరించి సెక్స్ చేస్తుంటే తృప్తి కలుగక పోవడంతో దానిని తీసేసి చేశాను. ఐతే ఆమె ప్రెగ్నెన్సీ వస్తుందేమోనని భయపడటంతో 48 గంటలు గడవక మునుపే ఐ పిల్ తెచ్చిచ్చాను. ఐతే ఆమె యోని నుంచి కొద్దిగా రక్తస్రావం కనబడుతున్నదని చెపుతోంది. ఇదేమైనా గర్భం వచ్చేందుకు సూచికా... లేదంటే గర్భం రాదని అనుకోవచ్చా...? 

 
కండోమ్ లేకుండా సెక్స్ చేసినట్లయితే గర్భం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే స్త్రీ ఋతుక్రమం వ్యవధిల్లో ఎగుడుదిగుడు ఉండవచ్చు. కనుక ఫలానా రోజుల్లోనే సెక్స్ చేస్తే గర్భం రాదని అనుకోలేము.
 
ఇకపోతే పీరియడ్ వచ్చిన తర్వాత 1-7 రోజులు, ఆ తర్వాత 19 నుంచి 28 రోజుల వరకూ సేఫ్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఈ మధ్యలో.. అంటే 8 రోజుల నుంచి 19 రోజుల వరకూ స్త్రీ రతిలో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశం ఎక్కువ. ఏదేమైనప్పటికీ సేఫ్ పీరియడ్ అని సెక్స్ చేసిన సందర్భాల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి కారణం స్త్రీ ఋతుక్రమాల వ్యవధిల్లో ఉన్న ఎగుడుదిగుడు సమయాలే.