శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 29 జులై 2014 (19:14 IST)

నా మాజీ ప్రేయసితో సెక్స్ చేసుకోమంది... కానీ ఆమె బోయ్‌ఫ్రెండుతో కూడా...

మా ఇద్దరికి పెళ్లై ఏడాది దాటింది. ఇటీవల గోవా వెళ్లాం. అక్కడ మా గత జీవితాలను చర్చించుకున్నాం. తనకు ఓ బోయ్ ఫ్రెండ్ ఉండేవాడట. నాక్కూడా ఓ ప్రేయసి ఉన్నదని చెప్పాను. దాంతో కావాలనుకుంటే ఆమెను పిలిపించి ఆమెతో సెక్స్ ఎంజాయ్ చేయమంది. ఇంటికి తిరిగి వచ్చాక నా మాజీ ప్రేయసికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. 
 
ఆమె రాగానే తనకు తన పిన్ని ఇంట్లో పని ఉందని చెప్పి వెళ్లిపోయింది. ఆరోజు నా మాజీ ప్రేయసి నేను సెక్స్ ఎంజాయ్ చేశాము. మరుసటిరోజు ఉదయం ఆమె వెళ్లిపోయిన తర్వాత నా భార్య తిరిగి వచ్చింది. ఇపుడు తన బోయ్ ఫ్రెండుతో తనకు కూడా ఎంజాయ్ చేయాలని ఉందట. అతడిని పిలువమని అంటోంది. నాకు మైండ్ పోతోంది.. ఏం చేయాలో అర్థం కావడంలేదు...
 
ఇలాంటి వివాహేతర సంబంధాలు అందరికి ఇబ్బందులు తెస్తాయి. గత జీవితాలు గురించి చెప్పుకున్నప్పటికీ పెళ్లయిపోయిన తర్వాత పాత స్నేహాలను తిరగదోడి వారితో లైంగిక సంబంధాలను పెట్టుకోవాలనుకోవడం తప్పు. మీరు చేసింది పెద్ద తప్పు. భార్య మాజీ ప్రేయసి గురించి, ఆమెతో సెక్స్ సుఖాన్ని గురించి ప్రస్తావించినపుడు వారించాల్సింది. 
 
మరో రకంగా చూస్తే ఆమె వ్యక్తిత్వానికి పరీక్ష పెట్టినట్లుగా అనిపిస్తోంది. మాజీ ప్రేయసితో సెక్స్ అనగానే వద్దని చెపుతారేమో అని ఎదురుచూసి ఉండవచ్చు. ఐతే అలా కాకుండా ఆమెతో లైంగిక ఆనందాన్ని చవిచూడటం జరిగిపోయింది. ఇపుడు ఆమె అలాంటి కోరికను వెళ్లబుచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాకుండా పోతుంది. కాబట్టి వివాహేతర సంబంధాలు తప్పు. వాటికి దూరంగా ఉండాలి.