శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 20 ఆగస్టు 2014 (13:50 IST)

సెక్స్ చేస్తుంటే నీవల్లేం తేలుతుందంటూ నా భార్య ఎగతాళి చేస్తోంది...

నేను చాలా లావుగా ఉంటాను. పెళ్లయ్యాక మరీ లావైపోయాను. కడుపు మాడ్చుకున్నా శరీరం తగ్గడంలేదు. నా పురుషాంగం స్తంభించినప్పుడు 4 అంగుళాలకు మించి ఉండటంలేదు. రాత్రిపూట నా భార్య వద్ద సెక్స్ చేయాలంటే నరకం కనబడుతోంది. ఆమె కింద నేను పైన ఉండే భంగిమను ఎప్పుడో ఆపేశాం. ఈ భంగిమలో ఎంత ప్రయత్నించినా నా పురుషాంగం ఆమె యోనిలో ప్రవేశించడంలేదు. దాంతో డాగీ స్టైల్ ప్రయత్నిస్తున్నా. 
 
ఈ పద్ధతిలో కూడా పురుషాంగం ఆమె యోని ద్వారం వరకూ వెళుతోందని కానీ ప్రవేశించడంలేదు. ఇదంతా కేవలం నేను లావుగా ఉండటం వల్లనే సాధ్యపడటంలేదు. నా అవస్థ చూసి నా భార్య ఎగతాళిగా నవ్వుకుంటోంది. కొన్నిసార్లయితే సెక్స్ చేసుకుందామని అడగ్గానే... నీవల్లకాదు... ఎందుకు లేనిపోని ప్రయాస అని హేళన చేస్తోంది. 
 
ఇటీవల ఆమె కొలీగ్ తో పరిచయం పెంచుకున్నది. నాకు చెప్పకపోయినా అతడితో సెక్సు సుఖాన్ని చవిచూస్తున్నట్లు తెలుసుకున్నాను. నేను సెక్స్ చేయలేకపోతున్నానని ఆమె మరో వ్యక్తితో ఆ సుఖాన్ని చవిచూస్తోంది. నేను మానసికంగా కుంగిపోతున్నాను. ఆమెను ఏమీ అనలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థంకావడంలేదు. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది.....
 
ఏ సమస్యకయినా ఆత్మహత్య పరిష్కారం కాదు. ఆత్మహత్య చేసుకుంటే సమస్య తీరిపోతుందా... అసలు సమస్యను పరిష్కరించేందుకు మనిషే లేకుండా పోతాడు కదా. ఇలాంటి ఆలోచనలు మనసు నుంచి తరిమివేయండి. భార్య మరొకరితో సెక్సులో పాల్గొంటుందని అనుకుంటున్నారు కానీ నేరుగా మీరు చూసింది లేదు. కాబట్టి చూడకుండా అపోహ పడవద్దు. 
 
ముఖ్యంగా మీరు మీ బరువు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకుగాను వైద్యుడిని సంప్రదించి ఆయన పర్యవేక్షణలోనే ఎలాంటి పదార్థాలను తీసుకోవాలో చర్చించి అలా నడుచుకోండి. సెక్స్ చేసేటపుడు పురుషాంగం చిన్నది పెద్దది అనే తేడా ఏమీ ఉండదు. అది స్తంభించే తీరుపైనే సెక్స్ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి పురుషాంగం సైజును గురించి బాధపడవద్దు. ముందు మీ శరీరాన్ని తగ్గించుకునేందుకు తగిన వ్యాయామాలు చేయండి సరిపోతుంది.