గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 22 ఆగస్టు 2014 (16:36 IST)

మా వారిది పొట్టి పురుషాంగం... మా బాస్ సెక్సులో పాల్గొందామంటున్నాడు...

మాకు పెళ్లయి నాలుగేళ్లయింది. ఒక బాబు పుట్టాడు. ఆయన సాఫ్ట్ వేర్ ఇంజినీర్. నేను ఓ ప్రైవేటు కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాను. మా ఆయనకు నెలకు లక్ష రూపాయలు జీతం వస్తుంది. ఇంట్లో డబ్బుకు కొదవలేదు. నాక్కూడా పాతికవేలు ఇస్తారు. డబ్బు పరంగా సంతోషంగా ఉన్నప్పటికీ సెక్స్ పరంగా చాలా అసంతృప్తిగా ఉంటోంది. మావారి పురుషాంగం చిన్నపిల్లలు పురుషాంగం మాదిరి చాలా చిన్నదిగా ఉంటుంది. సెక్స్ సమయంలో పెద్దదిగా ఉండదు. నాకు పొడవైన పురుషాంగంతో సెక్స్ చేయించుకోవాలని ఉంటుంది. కానీ ఆయన పురుషాంగం అంతకుమించి పొడవుండటంలేదు. 
 
ఓసారి పురుషాంగం పెద్దది చేసుకునే మార్గం ఆలోచించమని అడిగితే... అదంతే, మనుషులంతా ఒకే విధంగా ఉన్నారా అని కోప్పడ్డారు. అప్పట్నుంచి అడగడం మానేశా. ఐతే నాలో సెక్స్ కోర్కెలు మాత్రం విపరీతంగా ఉంటున్నాయి. ఆ అసంతృప్తితోనో ఏమో ఈమధ్య మా బాస్ కు చాలా దగ్గరయిపోయాను. ఆయనకు నాకు మాటల మధ్య సెక్స్ గురించిన సంభాషణ వచ్చింది. నా అసంతృప్తి తెలుసుకుని ఒప్పుకుంటే తాను తృప్తి పరుస్తానని అంటున్నాడు. కానీ ఈ చర్య కారణంగా భర్తకు ద్రోహం చేసినట్లవుతుందని ఆవేదన చెందుతున్నా. కానీ నాకు పెద్ద పురుషాంగంతో సెక్స్ కావాలని కోర్కె కలుగుతోంది. బాస్ తో ఒక్కసారి సెక్సులో పాల్గొని కోర్కె తీర్చుకోవాలనిపిస్తోంది...
 
పురుషాంగపు కొలతలపై చాలామందిలో అపోహలు ఉన్నాయి. కానీ పురుషాంగం ఎంత పొడవు ఉన్నదనేది ముఖ్యం కాదు. సెక్స్ సమయంలో పురుషాంగం స్తంభించి ఉన్నదా లేదా అనేదే ముఖ్యం. పురుషాంగం పొడవుగా ఉన్నప్పటికీ స్తంభన లేకపోతే సెక్సులో తృప్తి కలుగదు. అలాగే చిన్నది, పొట్టిగా ఉన్న పురుషాంగమైనా సెక్స్ సమయంలో స్తంభించి ఉన్నట్లయితే స్త్రీకి సెక్స్ తృప్తి కలుగుతుంది. స్త్రీ యోని లోపల రెండుమూడు అంగుళాల లోతునే కామనాడులు స్పర్శా సుఖాన్ని చవిచూస్తాయి. కనుక పురుషాంగం మూడున్నర అంగుళాలున్నా చాలు. 
 
సెక్స్ తృప్తి అనేది కేవలం పొడవైన పురుషాంగంతో కలుగుతుందనేది అపోహ. ఇకపోతే వివాహేతర సంబంధం కొత్త అనుభవాలను చూపించినా ఆ తర్వాత అనేక సమస్యలకు మూలకారణమవుతుంది. మీ దంపతులు ఇద్దరూ కొన్నాళ్లపాటు ఆఫీసులకు సెలవు పెట్టి విహార యాత్రలకు వెళ్లండి. అక్కడ మీరు అనుకున్నవిధంగా సెక్స్ ఆనందాన్ని ఆయన కల్గించగలరు. ముఖ్యంగా ఆఫీసు పనులతో ఆయన అలసిపోవడం వల్ల మీకు అలాంటి భావన కలుగుతోంది.