శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 27 ఆగస్టు 2014 (14:07 IST)

ఆమె నాతో కాకుండా పెళ్లయిన వాడితో సెక్స్ చేస్తోంది... ఎందుకని?

నాకు పెళ్లి కాలేదు. నా స్నేహితుడికి పెళ్లయి ఏడాది దాటింది. ఇద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. ఇటీవల మా ఆఫీసులో అందమైన యువతి ఉద్యోగంలో చేరింది. ఆమెను చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోయా. ఆమెతో స్నేహం చేస్తున్నాను. ఇటీవల ఆమె శరీరం నాకు తగిలించింది. ఆ స్పర్శను చవిచూసిన దగ్గర్నుంచి ఆమెతో సెక్స్ చేయాలనిపిస్తోంది. 
 
ఆమెతో నా మనసులో ఉన్న మాటను చెప్పాను. దానిని సున్నితంగా తిరస్కరించడమే కాకుండా నాతో మాటలు తగ్గించింది. అదేసమయంలో నా వెంట ఉండే పెళ్లయిన స్నేహితునితో క్లోజ్ గా తిరుగుతోంది. ఈమధ్య ఆమె విషయాన్ని నా స్నేహితుడి వద్ద ప్రస్తావిస్తే... తామిద్దరూ సెక్సులో పాల్గొన్నట్లు చెప్పాడు. పైగా నీతో సెక్స్ చేయడం ఆమెకు ఇష్టంలేదట అని అన్నాడు. పెళ్లి కాని నన్ను వదిలేసి పెళ్లయిన వాడితో సెక్సులో ఎందుకు పాల్గొంది. పెళ్లయిన పురుషుడితో సెక్సులో పాల్గొనేందుకు ఆమె ఎందుకు ఇష్టం చూపుతోంది...
 
పెళ్లయిన వారు, పెళ్లికాని వారు అనే తేడా ఏమీ ఉండదు. దీనికి కారణం మనస్తత్వాలు, ఆర్థిక స్థితిగతులతో పాటు ఎన్నో అంశాలు ఉంటాయి. సెక్స్ సుఖాన్ని పెళ్లయినవాడితోనే చవిచూడాలని స్త్రీ అనుకుంటుందని మీరు భావించడం కరెక్టు కాదు. మీ వ్యక్తిత్వమో లేదంటే మీకు సంబంధించి ఏదో ఒక విషయం ఆమెకు నచ్చి ఉండకపోవచ్చు. పైగా మీ స్నేహితుడు చెప్పింది నిజమని మీరు ఎలా అనుకుంటున్నారు. ఆమె అతడితో సెక్సులో పాల్గొంటుందనేది వాస్తవమని మీరు ఎలా నమ్మగలరు. అతడు చెప్పినదాన్నే మీరు నమ్ముతున్నారు. ఆమె నిజంగా అతడితో సెక్సులో పాల్గొన్నదో లేదో మీకు తెలియదు కదా.