శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 5 సెప్టెంబరు 2014 (14:48 IST)

ఆయన అరగంటకే ఔటైపోతున్నాడు... సెక్స్ సామర్థ్యాన్ని పెంచే మార్గం ఏంటి...?

ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లయి ఏడాది గడిచింది. ఈమధ్య నాకు ఆయనకు సెక్సుకు సంబంధించి ఘర్షణ జరుగుతోంది. నాకు అర్థగంటపాటు సెక్స్ కావాలని అడిగితే.. ఐదు నిమిషాల్లోనే ఔటైపోతున్నాడు. మళ్లీ కావాలన్నా చేయడంలేదు. సమస్యను నా స్నేహితురాలికి చెబితే ఆయనకు సెక్స్ పవర్ లేదేమోనని అనుమానం వ్యక్తం చేసింది. ఐతే ఆయన పెళ్లయిన కొత్తల్లో రోజుకు మూడునాలుగుసార్లు చేసేవారు. కానీ ఇప్పుడిలా అయ్యారు. ఇంగ్లీషు మందులకు ఆయన వ్యతిరేకం. ఆయుర్వేదం వేసుకోవాలని మాకు చెపుతుంటారు. ఆయన సెక్స్ సామర్ధ్యం పెంచేందుకు ఆయుర్వేద మందు ఏదైనా...
 
ఆయుర్వేదంలో కూడా సెక్స్ సామర్థ్యాన్ని పెంచే మందులున్నాయని చెపుతారు. ఇలాంటి వాటిలో....
 
పచ్చకర్పూరం 5 గ్రాములు, జాజికాయ 5 గ్రాములు, జాపత్రి 5 గ్రాములు తీసుకుని మూడింటిని మెత్తగా నూరి, దాంట్లో 5 గ్రాముల ఎండుద్రాక్ష వేసి మళ్లీ నూరి ఆ తర్వాత ఆ పేస్టును తీసుకుని వాటిని శనగ గింజంత మాత్రలుగా తయారుచేసుకోవాలి. రోజూ పడుకోబోయే ముందు ఒక్క మాత్రను వేసుకుని పాలు తాగితే వీర్యం వృద్ధి చెందడమే కాకుండా లైంగిక శక్తి కూడా పెరుగుతుంది.