శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : మంగళవారం, 9 సెప్టెంబరు 2014 (15:55 IST)

శీఘ్రస్ఖలనం కాకుండా గర్ల్‌ఫ్రెండ్‌తో ప్రాక్టీస్ చేస్తున్నా... అందుకేనా ఒత్తిడి...?

మేమిద్దరం ఇంకా పెళ్లి చేసుకోలేదు. దానికి మరికాస్త టైముంది. ఈలోపు మేమిద్దరం ఒకరికొకరు ఫోర్ ప్లే చేసుకుంటూ తృప్తిని అనుభవిస్తున్నాం. ఆమె వక్షోజాలను చూషిస్తూ యోని వద్ద ఫింగరింగ్ చేస్తాను. ఆమె తృప్తి పడుతుంది. తర్వాత ఆమె నా పురుషాంగాన్ని చేతిలోకి తీసుకుని హస్త ప్రయోగం చేస్తుంది. ఐతే ఆమె అంగాన్ని అలా పట్టుకుంటుందో లేదో వెంటనే వీర్యం స్ఖలనమైపోతోంది. ఇది చూశాక... పెళ్లయ్యాక కూడా ఇలాగే నిమిషాల్లో ఔటైతే ఎలా అని ఆమె ప్రశ్నించింది. 
 
ఇక అప్పట్నుంచి వీర్యం స్ఖలిస్తుందనగా గట్టిగా బిగబట్టేస్తాను. కొన్నిసార్లు వీర్యం స్ఖలిస్తాను చాలాసార్లు వీర్యాన్ని స్ఖలించకుండా ఉండగలుగుతున్నాను. కానీ ఈమధ్య ఎందుకో మానసిక ఆందోళన అధికమైంది. సెక్స్ యావ ఎక్కువవుతోంది. ఆమె ఫోర్ ప్లే చేసేటపుడు సెక్సులో పాల్గొనాలనిపిస్తోంది. కానీ పెళ్లయ్యేవరకూ ఇద్దరం సెక్సులో పాల్గొనకూడదని అనుకున్నాం... ఐతే నాలో తలెత్తిన ఈ సమస్యలను అధిగమించడమెలా...?
 
ప్రేమికులు హద్దులు దాటి ప్రవర్తిస్తే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయి. సెక్స్ అనేది సహజ క్రియ. దానిని ప్రతిసారీ అదిమిపెడుతూ ఉంటే సమస్య ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా ఫోర్ ప్లే సమయంలో ఆమె పురుషాంగంపై ఏ రీతిలో స్పర్శిస్తుందో తెలియదు కనుక ముందు ఆ పనిని ఆపేయమనండి. కొంతకాలం ఇలాంటి ఆలోచనలకు బ్రేక్ వేసి కెరీర్ పై ఇద్దరూ దృష్టి సారించండి. పెళ్లయ్యాక ఆ సుఖాన్ని చవిచూసేందుకు చాలా సమయం ఉంటుంది.