శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 18 సెప్టెంబరు 2014 (17:50 IST)

తొలిసారిగా ఆమెతో సెక్స్ చేయబోతున్నా.... స్త్రీలు అమితంగా ఇష్టపడే భంగిమ ఏది...?

మాకు పెళ్లయినప్పటికీ ఇద్దరం ఉద్యోగాల కోసం విదేశాల్లో ఉన్నాం. ఇప్పటికి స్థిరపడ్డాం. తొలిసారిగా ఇద్దరం సెక్సులో పాల్గొనబోతున్నాం. ఆమెను సెక్సులో బాగా తృప్తి పరచాలంటే ఎలాంటి భంగిమలో సెక్స్ చేస్తే తృప్తి పరచగలను...?
 
సెక్సులో సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడాతారని సెక్సాలజిస్టులు చెబుతారు. రోజుకో భంగిమ జరిపినా, ఈ మూడు రకాల సెక్స్ భంగిమలను తరచూ ఉపయోగించడం ద్వారా భాగస్వామిని పూర్తిగా సంతృప్తి పరచడం సాధ్యపడగలదని వారు పేర్కొంటున్నారు. రోజంతా బాగా అలసిపోయే స్త్రీలు తమ భాగస్వామి తమపై నుంచి జరిపే సెక్స్ పద్ధతిని కోరుకుంటారని వారు చెబుతున్నారు. 
 
సెక్స్ కోరికలు అధికంగా కలిగిన అమ్మాయిలైతే తామే పైన కూర్చుని సెక్స్ జరిపించుకోవడాన్ని, అలాగే తాము వంగి, వెనకవైపు నుంచి పురుషుడు జరిపే సెక్స్‌ను బాగా ఇష్టపడతారని చెప్పారు. దీనిపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో సైతం ఇదే విషయం తేలింది. 
 
పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం ద్వారా ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ ఆనందం పొందగలమని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు సెక్స్ రాపిడి బలంగా ఉండాలంటూ ముందుకు వంగి వెనుక వైపు నుంచి భాగస్వామితో సెక్స్ చేయించుకోవడమే బాగుంటుందని చెబుతున్నారు. సెక్స్ చేసే భంగిమలు ఎన్ని ఉన్నా ఈ మూడింటినే ఎక్కువ ఇష్టపడుతున్నారట.