గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 1 అక్టోబరు 2014 (15:14 IST)

విడాకులు తీసుకున్నాను... అతడితో సెక్స్ ఎంతో తృప్తి... పెళ్లి చేస్కుంటా అంటున్నాడు...

నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు నమ్మించి పెళ్లాడిన తర్వాత 2 సంవత్సరాలకు నేను మరొకడితో సెక్స్ సంబంధం పెట్టుకున్నానని నిందించాడు. దాంతో అతడికి విడాకులిచ్చేశాను. నాకు పిల్లల్లేరు. ఐతే నేను పెద్దలను ఎదిరించి పెళ్లాడినందుకు మా పేరెంట్స్ నన్ను ఇంటికి రానివ్వడంలేదు. ఉద్యోగం ఉంది. ఆర్థికంగా బాగానే ఉన్నాను. ఇప్పుడు నా జీవితంలోకి మరొకతను ప్రవేశించాడు. ఎంతో స్నేహంగా ఉంటాడు. నా భావాలకు దగ్గరగా ఉన్నట్లనిపిస్తున్నాడు. 
 
ఇద్దరం ఈమధ్య కాలంలో పలు పర్యాటక కేంద్రాలను దర్శించాము. ఆ సమయంలో ఇద్దరం పలుమార్లు సెక్సులో పాల్గొన్నాము. అతడితో సెక్స్ అంటే చెప్పలేనంత తృప్తిని కలిగిస్తుంది. ఐతే అతడు ఇంతకుమునుపే మరో అమ్మాయిని మోసం చేశాడని నా స్నేహితురాలు చెప్పింది. ఈ విషయాన్ని అతడిని అడగాలంటే గిల్టీగా ఉంది. కానీ అతడు మాత్రం నన్ను పెళ్లాడుతానంటున్నాడు. పెళ్లి చేస్కుంటే ఎలా ఉంటుంది...?
 
ఇప్పటికే తల్లిదండ్రులను కాదని ఒకరిని పెళ్లాడి జీవితంలో తప్పటడుగు వేశారు. ప్రేమించడం తప్పు కాకపోయినప్పటికీ ప్రేమిస్తున్న వ్యక్తి ఎలాంటివాడో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగినది తిరిగి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పుడు పరిచయమైన వ్యక్తి గురించి మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేతప్ప... అతడు పెళ్లి అని చెప్పగానే ఓకే చెప్పడం మంచిది కాదు. పైగా మీ స్నేహితురాలు హింట్ కూడా ఇచ్చిందంటున్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే అతడితో పెళ్లి కాకుండా సెక్స్ సంబంధాలను కొనసాగించడం మంచిది కాదు.